క్రైమ్/లీగల్

‘తత్కాల్’ నిందితుడిపై అక్రమ ఆస్తుల కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: తత్కాల్ రైల్వే టికెట్ల సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేసి అరెస్టయిన సీబీఐ ప్రోగ్రామర్ భారీగా అక్రమాస్తులు కూడగట్టినట్టు వెల్లడైంది. అజయ్ గర్గ్ అనే అసిస్టెంట్ ప్రోగ్రామర్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు తాజాగా కేసు నమోదు చేశారు. గర్గ్ ఆదాయానికి మించి 96.09 లక్షల రూపాయలు కలిగి ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కేంద్రంలో అజయ్ గర్గ్ సాఫ్ట్‌వేర్ సహాయ ప్రోగ్రామర్‌గా పనిచేసేవాడు. రైల్వే తత్కాల్ టికెట్ల బుకింగ్ సాఫ్ట్‌వేర్‌ను విక్రయించినట్టు తేలింది. డిసెంబర్‌లో అతడిని అరెస్టు చేశారు. 2011-17 మధ్య కాలంలో కోటీ 46 లక్షల రూపాయలు అక్రమ మార్గాల ద్వారా సంపాదించినట్టు విచారణలో వెల్లడైంది. సీబీఏ ఆఫీసులో పనిచేయడానికి ముందు అతడు ఐఆర్‌సీటీసీలో పనిచేశాడు. 2007-11 మధ్య తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంపై పట్టుసాధించి తద్వారా అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడం మొదలెట్టాడు. విచారణ జరిపిన సీబీఐ అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి 2017 డిసెంబర్‌లో అరెస్టు చేసింది. అజయ్ గర్గ్ స్నేహితుడు అనిల్ గుప్తాను అరెస్టు చేశారు. ప్రయాణానికి 24 గంటల ముందే తాత్కాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఏసీ టికెట్లు ఉదయం 10 గంటలు, స్లీపర్ క్లాస్ టికెట్లు ఉదయం 11 గంటలకు ఐఆర్‌సీటీసీ ద్వారా లభ్యమవుతాయి. అయితే బుక్కింగ్ ప్రారంభమైన క్షణాల్లోనే టికెట్లు అయిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందేవారు. ఇది ఎప్పటి నుంచో వస్తోంది. దీనిపై ప్రయాణికులు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయడం మామూలు వ్యవహారం అయిపోయింది. అయితే అజయ్ గర్గ్ 2011లో సీబీఏ ఆఫీసులో ప్రవేశించాక ఓ నకిలీ సాఫ్ట్‌వేర్ రూపొందించాడు. దాన్ని ఏజెంట్లకు అమ్మేసి రెండు చేతులా సంపాదించడం మొదలెట్టాడు. గర్గ్ దీని కోసం ఏ నెట్‌వర్క్‌నే ఏర్పాటు చేసుకున్నాడు. స్వదేశీ, విదేశీ ఆపరేటర్లు అతడి ఏజెంట్లుగా ఉన్నారని సీబీఐ విచారణలో వెల్లడైంది.