క్రైమ్/లీగల్

బేతవోలు స్మశానవాటికలో హత్య కేసును చేధించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, మే 17: గత ఏప్రిల్ 28వ తేదీ రాత్రి గుడివాడ పట్టణంలోని బేతవోలు స్మశానవాటికలో జరిగిన హత్యకేసును వన్‌టౌన్ పోలీసులు ఛేదించారు. మృతుడు గుడివాడ రూరల్ మండలం లింగవరం గ్రామానికి చెందిన ఇలపర్తి నాగచౌదరి(25)గా గుర్తించిన వన్‌టౌన్ పోలీసులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నాగచౌదరి తలకు బలమైన గాయం కావడం వల్లే మృతి చెందినట్టుగా తేలింది. అయితే కేసు దర్యాప్తులో అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ ఎట్టకేలకు ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకుని మీడియా ఎదుట హాజరుపర్చారు. గురువారం స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో జిల్లా అడిషినల్ ఎస్పీ సాయికృష్ణ మాట్లాడుతూ పట్టణంలోని ధనియాలపేటకు చెందిన నిందితులు భార్గవ్, సుబ్రహ్మణ్యంలు హత్యకు పాల్పడినట్టుగా తేలిందన్నారు. హత్యకు ఉపయోగించిన సెంట్రింగ్ చెక్కను మీడియాకు చూపించారు. భార్గవ్ సోదరి పట్ల నాగచౌదరి అనుచితంగా ప్రవర్తించాడనే కోపంతో తన స్నేహితుడు సుబ్రహ్మణ్యంతో కలిసి హత్య చేశారన్నారు. హత్య జరిగిన సమయంలో సంఘటనా స్థలానికి సమీపంలో సెల్‌టవర్ పరిధిలోని దాదాపు 1500్ఫన్ నెంబర్లను సుమారు 15బృందాలు తనిఖీ చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఇది తెలియని నిందితులు మృతుడి సెల్‌ఫోన్‌ను వినియోగించడంతో కేసు మిస్టరీని చేధించడం పోలీసులకు తేలికైపోయింది. నిందితులు భార్గవ్, సుబ్రహ్మణ్యంలను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్టుగా అంగీకరించారన్నారు. గుడివాడ డీఎస్పీ పీ మహేష్ ఆధ్వర్యంలో వన్‌టౌన్ ఎస్‌ఐ డీ వెంకటరమణ నిందితులను పట్టుకోవడంలో చేసిన కృషిని జిల్లా అడిషినల్ ఎస్పీ సాయికృష్ణ అభినందించారు. ఈ సమావేశంలో సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.