క్రైమ్/లీగల్

ప్రేమికుల ఆత్మాహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడుమూరు, మే 20:ప్రేమ పెళ్లికి పెద్దలు అడ్డుచెప్పడంతో ఆ జంట పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం కోడుమూరు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. వారిలో ప్రియురాలు చికిత్స పొందుతూ మృతి చెందగా, ప్రియుడు పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. కోడుమూరుకు చెందిన కురువ కీర్తి స్థానికంగా ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం పూర్తి చేసుకుంది. అలాగే క్రిష్ణాపురం గ్రామానికి చాకలి హరీష్ కోడుమూరులో ఒక మెడికల్ షాపులో పని చేస్తున్నాడు. వీరు గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వీరి ప్రేమ వ్యవహారం పెద్దల దృష్టికి తీసుకుపోగా పెద్దలు అడ్డు చెప్పడంతో వారు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలో ఆదివారం మధ్యాహ్నం కీర్తి, హరీష్ ద్విచక్ర వాహనంలో ప్యాలకుర్తి గ్రామ సమీపంలోని మామిడి తోటకు చేరుకుని వెంట తీసుకెళ్లిన పురుగుల మందు తాగి మళ్లీ కోడుమూరుకు వచ్చారు. పట్టణంలోకి చేరుకోగానే ఇద్దరూ రోడ్డుపై కిందకు పడిపోయారు. వీరిని గమనించిన స్థానికులు వెంటనే స్థానిక ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ కీర్తి(20) సాయంత్రం మృతి చెందగా హరీష్ పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలిసిన వెంటనే కోడుమూరు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.