క్రైమ్/లీగల్

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఒకేరోజు 138 మంది జైలుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మే 21 : మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై జిల్లా పోలీస్ యంత్రాంగం కొరఢా ఝులిపించింది. అందులో భాగంగా జిల్లావ్యాప్తంగా పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లాలో మొదటిసారిగా 138 మందిని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకే రోజు పోలీసులు జైలుకు పంపారు. ఒంగోలు పట్టణంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని తనిఖీ చేసి ఒంగోలు వన్ టౌన్ పోలీసులు 16 మంది, ఒంగోలు టూ టౌన్ పోలీసులు నలుగురిని, ట్రాఫిక్ పోలీసులు 118 మందిని, మొత్తం 138 మంది పై ఎంవి యాక్టు ప్రకారం కేసులు నమోదు చేశారు. వారందరినీ స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చగా ఒక్కొక్కరికి 2100 రూపాయలు జరిమానా, ఒక్కొక్కరికి రెండు రోజుల నుండి గరిష్టంగా 15 రోజుల వరకు జైలు శిక్ష విధిస్తూ జిల్లా జడ్పి తీర్పునిచ్చారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా 138 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి జరిమానా, జైలు శిక్ష విధించినట్లు ఎస్‌పి సత్య ఏసుబాబు తెలిపారు.