క్రైమ్/లీగల్

ఫర్నీచర్ దుకాణంలో చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 22: స్థానిక పెద్దకాపు లే అవుట్‌లోని కుర్లాన్ బెడ్స్ ఫర్నీచర్ దుకాణంలో ఈ యేడాది ఏప్రిల్ 15వ తేదీన చోరీకి పాల్పడిన గుత్తా శ్రీనివాసులును తిరుచానూరు బైపాస్ రోడ్డులోని కొత్తపాళెం లేఅవుట్‌లో ఉన్న సూర్యతేజ టవర్స్ వద్ద అరెస్ట్ చేసినట్లు క్రైమ్ డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆ దుకాణంలో చోరీ చేసిన రూ. 3.50లక్షల నగదును, దొంగతనానికి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మంగళవారం క్రైమ్‌పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీనివాసులు ఇన్నోవా వాహనం నడుపుకుంటూ జీవనం సాగించేవాడన్నారు. ఈ సమయంలో కుర్లాన్ బెడ్స్ దుకాణం యజమాని జితేంద్ర, కృష్ణమూర్తిలతో పరిచయాలు ఏర్పరుచుకున్నాడన్నారు. ఈ సందర్భంగా కుర్లాన్ సంస్థ ప్రతినిధులు వచ్చినపుడు బాడుగకు వాహనం పెట్టేవాడన్నారు. అలా వారితో సంబంధాలు పెట్టుకుని తరచూ దుకాణానికి వెళుతూ అక్కడ జరిగే వ్యాపార లావాదేవీలను, ముఖ్యంగా అక్కడి పరిస్థితులను సీసీ కెమేరాల పనితీరును గమనించాడన్నారు. ఈ క్రమంలో జితేంద్ర మోటార్‌సైకిల్ తాళానికి ఉన్న గుత్తిలో దుకాణానికి సంబంధించిన తాళాలు దొంగతనం చేశాడన్నారు. ఈ క్రమంలో ఏప్రిల్‌లో దొంగతనానికి పాల్పడ్డాడని తెలిపారు. ఇందులో భాగంగా తాను దొంగతనం చేయదలుచుకున్న రోజుకు ముందు సీసీ కెమేరాలను కూడా పనిచేయకుండా నిలిపివేశాడన్నారు. ఆ సమయంలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ జితేంద్రతో కలసి దుకాణం వెలుపలికి వెళ్లి చోరీకి పథకరచన చేసి, చోరీకి పాల్పడ్డాడన్నారు. దుకాణ యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ కేసు ఛేదించడంలో సీఐలు అబ్బన్న, భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐ రమేష్‌బాబు, క్రైమ్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ద కనపరిచారని, వారికి రివార్డులు అందజేయాల్సిందిగా ఎస్పీకి ప్రతిపాదనలు పంపామన్నారు.