క్రైమ్/లీగల్

క్రికెట్ బుక్కీల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 22: నగరంలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాలను మంగళవారం అరండల్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు అర్బన్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు. షేక్ సాధిక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదనపు ఎస్‌పిలు వైటి నాయుడు, సుబ్బారాయుడుల పర్యవేక్షణలో డిఎస్‌పి సరిత నేతృత్వంలో స్పెషల్ టాస్క్ఫోర్స్ సిబ్బంది స్థానిక అమరావతి రోడ్డులోని ముత్యాలరెడ్డి నగర్‌లో నివాసం ఉంటున్న నల్లపనేని సురేంద్రనాధ్ ఇంట్లో కారులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై ఏకకాలంలో దాడి చేసి ఏదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తూమాటి శ్రీనివాసరావు, వాసా శివాజీ, రాయిడి శ్రీనివాసరావు, సాదినేని వెంకట నారాయణ, సాదినేని మణికంఠ, నల్లపనేని సురేంద్రనాధ్, చావా నారాయణరావులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 4,86,850 రూపాయలు, కమ్యూనికేట్ బాక్సు, 19 సెల్‌ఫోన్‌లు, టివి, ల్యాప్‌టాప్, ప్రింటర్, కారుతో పాటు 7 ఏటిఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులైన తూమాటి శ్రీనివాసరావు, రాయిడి శ్రీనివాసరావు, వాసా శివాజీ, సాదినేని వెంకట నారాయణ, మణికంఠ, నల్లపనేని సుబ్బయ్య అలియాస్ సురేంద్రనాధ్, చావా నారాయణరావులు గతంలో ఫైనాన్స్ వ్యాపారం, వ్యవసాయం చేసి ఆర్థికంగా నష్టపోయారన్నారు. క్రికెట్ బెట్టింగ్‌ల వలన లాభం లేదని బుక్కీలుగా మారారన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లలో పాల్గొన్న వారి వివరాలు తెలుసుకుని కేసులు నమోదు చేస్తామని, యువత ఇటువంటి వారికి దూరంగా ఉండాలని సూచించారు.