క్రైమ్/లీగల్

మత్తు మందు ఇచ్చి బంగారం చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, మే 22 : ప్రయాణంలో ఉన్న వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి 8 తులాల బంగారు నగలు చోరీ చేసిన ఘటన మంగళవారం పట్టణంలో సంచలనం రేపింది. విడపనకల్లు మండలం డోనేకల్లుకు చెందిన లక్ష్మీదేవి గుంతకల్లులోని తన కుమార్తె ఇంటికి వస్తూ బళ్లారి నుంచి గుంతకల్లుకు వస్తున్న ఓ ప్రైవేట్ బస్సులో డోనేకల్లులో ఎక్కింది. అయితే ఆమెతోపాటు పక్కనే కూర్చున్న ఇద్దరు మహిళలు లక్ష్మీదేవికి మత్తు మందు ఇవ్వడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. బస్సు గుంతకల్లుకు రాగానే వృద్ధురాలిని బస్సు నుంచి కిందకు దింపి బస్టాండ్‌లోకి తీసుకొచ్చారు. లక్ష్మీదేవిని బస్టాండ్‌లో కూర్చోబెట్టి చేతికి ఉన్న నాలుగు బంగారు గాజులు, లాంగ్ చైన్‌ను తీసుకున్నారు. అయితే అదే సమయంలో కర్నూలు జిల్లా చిప్పగిరి నుంచి వచ్చిన సోదరి సుశీలమ్మ లక్ష్మీదేవిని పలకరించింది. అయితే పక్కనే ఉన్న గుర్తు తెలియని మహిళలు తాము తీసుకెళ్తామంటూ దబాయించడంతో సుశీలమ్మ తిరుగు ప్రయాణమైంది. అంతలో ఆలోచించుకున్న సుశీలమ్మ అక్కతోపాటు గుర్తు తెలియని మహిళల పట్ల అనుమానంతో బస్సు దిగి వచ్చింది. అప్పటికే గుర్తు తెలియని మహిళలు ఉడాయించారు. అక్కకు అపస్మారక స్థితిలో ఉన్న సమాచారాన్ని పట్టణంలోని రాజేంద్రనగర్‌లో నివాసం ఉటున్న వృద్ధురాలి కుమార్తె కొడుకు (మనవడు)కు సమాచారం అందించింది. దీంతోపాటు టుటౌన్ పోలీసులకు సమాచారం అందించడం ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. వృద్ధురాలిని వైద్య చికిత్సల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, బస్టాండ్‌లో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించారు. ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.