క్రైమ్/లీగల్

నిరుద్యోగికి టోకరా - లక్షలు స్వాహా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం,మే22: ఉద్యోగం ఆశ చూపి నిరుద్యోగి నుండి లక్షలాది రూపాయలు స్వాహా చేసిన నిందితుడుని స్దానిక పోలీస్‌ష్టేషన్ హెచ్ సి పెదమజ్జి శ్రీను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దత్తిరాజేరు మండలం తిమిటేరు బూర్జివలస గ్రామానికి చెందిన చిప్పాడ శ్రీనువాసరావు గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామం పరిధిలో గల మామిడిబందకాలనీలో గత కొంత కాలంగా నివాసం ఉంటున్నాడు. రామభద్రపురం మండలం నాయుడువలస గ్రామానికి చెందిన పతివాడ శివున్నాయుడుకి సాంఘిక సంక్షేమశాఖలో తనకు తెలిసిన అధికారులు ద్వారా ఉద్యోగం ఇప్పిస్తానని పధకం ప్రకారం దపదపాలుగా 5,17,215 రూపాయలు స్వాహా చేశాడు. శివున్నాయుడుప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న ఆశతో శ్రీనువాసురావుకు గల బ్యాంకు ఖాతాలో పలుసార్లు 3,88,000 రూపాయలు వేశాడు. అలాగే 1,15,000 రూపాయలు నగదు రూపంలో ముట్టజెప్పాడు. 2014 నుంచి అదిగో, ఇదిగో ఉద్యోగం వస్తుందంటూ కాలయాపన చేయడంతో గ్రామ పెద్దలకు శివున్నాయుడు పిర్యాదు చేశాడు. శ్రీనువాసరావు శివున్నాయుడుతోపాటు మరికొంత మంది నిరుద్యోగులను మోసగించాడని తెలియడంతో శివున్నాయుడు పోలీసుష్టేషన్‌లో పిర్యాదు చేశాడు. పిర్యాదు మేరకు స్దానిక హెడ్‌కానిస్టేబుల్ పెదమజ్జిశ్రీను దర్యాప్తు జరిపిన అనంతరం నిందితుడైన చిప్పాడ శ్రీనివాసరావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.