క్రైమ్/లీగల్

బైకును ఢీకొట్టిన కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపేట, మే 22: మండల పరిధిలోని అవిడి శివారు అమలాపురం ప్రధాన రహదారిపై మోటారు సైకిల్‌ను కారు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడినట్లు ఎస్సై హరీష్‌కుమార్ తెలిపారు. మండల పరిధిలోని మోడేకుర్రుకు చెందిన నంద్యాల సత్యనారాయణ (60), బద్దిరెడ్డి సూర్యనారాయణ (60) మృతి చెందగా, గంగుమళ్ల లక్ష్మీనారాయణ తీవ్రంగా గాయపడినట్లు ఎస్సై తెలిపారు. మోడేకుర్రు నుంచి వీరు బైకుపై వస్తుండగా రావులపాలెం వైపునుంచి వస్తున్న కారు ఎదురుగా ఢీకొట్టింది. దీంతో బైకు నడుపుతున్న సత్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రంగా గాయపడిన సూర్యనారాయణ, లక్ష్మీనారాయణను కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వీరి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో వెంటనే 108లో రాజమహేంద్రవరానికి తరలించగా అందులో సూర్యనారాయణ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. దీనిపై కేసు నమోదుజేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్సై హరీష్‌కుమార్ తెలిపారు. టీడీపీ యువ నాయకుడు బండారు సంజీవ్ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.