క్రైమ్/లీగల్

దొంగ నోట్ల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దాపురం, మే 22: పట్టణంలో దొంగ నోట్ల మార్పిడికి పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను వేర్వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఒక లక్షా 42వేల 600 విలువ గల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు పెద్దాపురం డీఎస్పీ చిలకా వెంకట రామారావు తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దొంగ నోట్ల మార్పిడి కేసులో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఒకరు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇద్దరు చెడు వ్యసనాలకు అలవాటుపడి మరో ఇద్దరు స్నేహితులతో కరెన్సీ నోట్లను ప్రింటర్ ద్వారా ముద్రిస్తూ దొంగ నోట్ల మార్పిడికి పాల్పడుతున్నారన్నారు. సోమవారం పట్టణంలోని దర్గా సెంటర్‌లో సామర్లకోటకు చెందిన బూసాల రవితేజ పండ్ల దుకాణం వద్ద నకిలీ రూ.500 నోటు మార్చేందుకు ప్రయత్నించగా మాటువేసి పట్టుకున్నట్టు తెలిపారు. అతని వద్ద నుంచి తొమ్మిది రూ.500 నోట్లను స్వాధీనం చేసుకుని విచారించగా కాకినాడ శశికాంత్‌నగర్‌లోని సాయి అపార్ట్‌మెంటులోగల ఐదవ ఫ్లోర్‌లో నివాసముంటున్న కొవ్వూరి వినోద్ సంతోష్‌రెడ్డి (ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్), అతని మిత్రుడు వసంతాడ దినేష్‌లు దొంగనోట్లు సరఫరా చేస్తున్నట్టు తెలియడంతో కాకినాడలో దాడులు చేసి వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి వద్ద నుంచి సుమారు 42వేలు విలువచేసే 2000, 500, 100 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరు పాతగాజువాకకు చెందిన వారాజు రాజశేఖర్ వద్ద నుంచి నకిలీ కరెన్సీని తీసుకువచ్చి సామర్లకోట, కాకినాడ, పెద్దాపురంలో చెలామణి చేస్తున్నట్టు తెలిసిందన్నారు. వారాజు రాజశేఖర్ 2015లో కన్నతల్లిని హత్యచేసిన కేసులో నిందితునిగా ఉన్నాడన్నారు. ఇతను బీటెక్ పూర్తిచేసి ఖాళీగా ఉంటూ నోట్ల మార్పిడికి పాల్పడుతున్నట్టు తెలిపారు. మరో మిత్రుడు షేక్ ఆలీం వైజాగ్ కూర్మన్నపాలెంలో నోట్ల మార్పిడి చేస్తూ వీరికి సహకరిస్తున్నట్టు తెలిసిందన్నారు. అతనిని వైజాగ్‌లో అదుపులోకి తీసుకోగా, అతని వద్ద నుంచి 12,500 రూపాయల నగదు, ప్రింటర్, ల్యాప్‌టాప్ ఇతర కరెన్సీ తయారీకి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆలీం అత్యాచారం, హత్యాయత్నం కేసుల్లో పాత ముద్దాయిగా ఉన్నట్టు డీఎస్పీ తెలిపారు. వీరంతా ముఠాగా ఏర్పడి మొదట్లో కేవలం వీరి అవసరాల కోసం కరెన్సీ నోట్లను ప్రింటర్‌పై స్కాన్ చేసి గుట్టు చప్పుడు కాకుండా రద్దీ ప్రాంతాల్లో చలామణి చేస్తూ గడిపేవారన్నారు. ఇటీవల కాలంలో దీనిని వృత్తిగా మార్చుకుని వేల సంఖ్యలో నోట్లను ముద్రిస్తూ పలుచోట్ల మార్పిడికి ప్రయత్నించినట్టు తెలిసిందన్నారు. ఈ ఐదుగురిని అరెస్టు చేసి మంగళవారం కోర్టులో హాజరుపరిచినట్టు డీఎస్పీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో సీఐ వైఆర్కే శ్రీనివాస్, క్రైమ్ సీఐ వల్లీ, బలరామ్, ఎస్సై సూర్యనారాయణ, కానిస్టేబుళ్లు టైసన్, రాధాకృష్ణ, రాకేష్, నాగరాజు, రంగంపేట ఎస్సై వెంకటేశ్వరరావు, పెద్దాపురం ఎస్సై కృష్ణ్భగవాన్ తదితరులు పాల్గొన్నట్టు డీఎస్పీ తెలిపారు.