క్రైమ్/లీగల్

పాములేరు వాగులో పడి యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారేడుమిల్లి, మే 22: మారేడుమిల్లి మండలం గుజ్జుమామిడివలస పంచాయితీ పరిధిలోని వాలమూరు గ్రామంలో గల పాములేరు వాగులో పడి మంగళవారం ఒక యువకుడు మృతి చెందగా మరో యువకుడు గల్లంతయ్యాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన నందికళ్ళ మణీంద్ర (21), గ్రంధి బుచ్చిరాజుగుప్త (21) పాములేరువాగులో స్నానం చేస్తుండగా గల్లంతయ్యారు. వారితో ఉన్న మరో ఇద్దరు స్నేహితులు సుబ్రహ్మణ్యం, నరేంద్ర, చుట్టుపక్కల గిరిజనులు గాలింపు చర్యలు చేపట్టగా మణీంద్ర మృతదేహం లభ్యమైంది. మారేడుమిల్లి సీఐ వై రవికుమార్, ఎస్సై తులసీరాం సిబ్బందితో హుటాహుటిన చేరుకొని గాలింపు చర్యలు ముమ్మరం చేసారు. మారేడుమిల్లిలో తీవ్రమైన ఈదురుగాలులు, వర్షం కారణంగా గాలింపుచర్యలకు అంతరాయం ఏర్పడింది.