క్రైమ్/లీగల్

అనుమానాస్పద వ్యక్తి పోలీసులకు అప్పగింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరవాసరం, మే 22: ఇటీవల ప్రసార మాధ్యమాల్లో సైకోలు తిరుగుతున్నారంటూ వదంతులు వస్తున్న నేపథ్యంలో మంగళవారం వీరవాసరంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక వ్యక్తిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. పెరిగిన జుత్తు, గెడ్డం, మాసిబోయిన దుస్తులతో ఆ వ్యక్తి చూసేందుకు భయంకరంగా ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు అప్పగించారు. వీరవాసరం ఎస్సై ఎం శ్రీనివాసరావు సదరు వ్యక్తిని పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించగా అతని సమాచారం విచిత్రంగా ఉండడంతో అతని వద్దనున్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. అందులో అపరిచిత వ్యక్తి విద్యా ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతా, పాస్‌పోర్టు, కొంత నగదు కనిపించాయి. వీటిని పరిశీలించగా ఆ వ్యక్తి పేరు మేకా తారక రామారావు అని, తండ్రి పేరు వెంకటేశ్వరరావుగా గుర్తించారు. విజయవాడలోని విద్యాధరపురం నివాసిగా గుర్తించారు. అతని పాస్‌పోర్టును పరిశీలించగా 2012లో జారీ చేసిన పాస్‌పోర్టులో తారకరామారావు, గుడివాడలోదిగా ఉంది. సదరు వ్యక్తి 2003-04లో విజయవాడలో టెన్త్ చదివినట్లుగాను, 2004-06లో ఇంటర్ ఎంపీసీ విజయవాడ సిద్ధార్థ కళాశాలలో చదివినట్టు, 2006-10లో బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ గుంటూరులో చదివినట్టు సర్ట్ఫికెట్ల ద్వారా పోలీసులు గుర్తించారు. అతని వద్దగల ఫోను నెంబర్ల ఆధారంగా విజయవాడలోని అతని బంధువులకు ఫోనుచేసినా ఎటువంటి స్పందనా రాలేదు. ఇద్దర్ని పోలీసులను ఎస్కార్ట్‌గా ఇచ్చి తారక రామారావును విజయవాడ పంపించారు. రామారావు తెలుగు, ఇంగ్లీషు, హిందీ ధారాళంగా మాట్లాడుతున్నాడు. అనుమానాస్పద వ్యక్తి విద్యావంతుడని తెలియడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై ఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తారక రామారావు విద్యావంతుడని, తల్లిదండ్రులిద్దరూ మృతిచెందడంతో విజయవాడలో అతని సోదరుడు వద్ద ఉంటున్నాడని చెప్పారు. గత కొంత కాలంగా ఇంటిని విడిచి ఇలా సంచరిస్తుండడంతో అతని వేషభాషను చూసి గ్రామస్థులు భయపడ్డారన్నారు. ఇటీవల సెల్‌ఫోన్లలోని వాట్సప్‌లో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దన్నారు. ఈ వదంతుల వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, ఇటువంటి సమాచారం ఒకరి నుంచి మరొకరికి పంపించవద్దని ఎస్సై విజ్ఞప్తి చేశారు.