క్రైమ్/లీగల్

ఉరి వేసుకొని .. మహిళ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్సెట్టిపేట, మే 22: మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన అంకూస్‌బీ (45) అనే మహిళ ఇంట్లోని రేకుల షెడ్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి... మృతురాలికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. తన పెద్ద కూతురు మానసిక పరిస్థితి బాగా లేదని, ఆమె విషయంలోనే అంకూస్‌బీ ఎప్పుడూ దిగాలుగా ఉండేందని కుటుంబసభ్యులు చెప్పారు. ఇదే విషయంలో కూడా గతంలో వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే కుటుంబ సభ్యులు గమనించి కాపాడటం జరిగిందని తెలిపారు. కూతురు మానసిక పరిస్థితి ఇంకా నయం కాదన్న దిగాలుతో కలత చెంది ఆమె ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఆత్మహత్య చేసుకుందని వారు పేర్కొన్నారు. మృతురాలి భర్త మహ్మద్ ఖుదాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.