క్రైమ్/లీగల్

డ్రైవర్‌కు జైలు శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందలూరు, మే 24: నందలూరు హైవేలో గురువారం నిర్వహించిన వాహనాల తనిఖీలో మద్యం సేవించి లారీని నడిపిన బేతంచర్లకు చెందిన డ్రైవర్ ఎం.వెంకటేష్‌ను కోర్టులో హాజరు పరచగా జడ్జి సౌమ్యజోసిఫిన్ 70 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై ప్రతాప్‌రెడ్డి తెలిపారు. శిక్ష విధించిన డ్రైవర్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
దుకాణంలో పేలిన సిలిండర్
రైల్వేకోడూరు, మే 24: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రాజేష్ స్వీట్ దుకాణంలో గురువారం సాయంత్రం గ్యాస్ సిలిండర్ లీకై అగ్నిప్రమాదం సంభవించినట్లు ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు. ప్రమాదం జరిగినపుడు దుకాణంలో ఎవరు లేక పోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. సకాలంలో తమకు సమాచారాన్ని యాజమాని రాజేష్ అందించడంతో ఆస్తినష్టం పెద్దగా జరగలేదన్నారు. గ్యాస్ ప్రమాదాలపై తాము అవగాహన కల్పిస్తున్నా నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరగడం బాధాకరమన్నారు. జరిగిన ప్రమాదంలో సుమారు రూ. 10 వేల మేరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు ఆయన పేర్కొన్నారు.
ట్రాక్టర్ బోల్టా: ఒకని మృతి
దువ్వూరు, మే 24: మండల పరిధిలోని యర్రబల్లె గ్రామంలో ట్రాక్టర్ బోల్తాపడి బి.పవన్‌కళ్యాణ్‌కుమర్‌రెడ్డి(24) మృతి చెందినట్లు దువ్వూరు ఎస్‌ఐ విద్యాసాగర్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తితే ప్రొద్దుటూరు మండలం, సగిరి గుమ్మాయిపల్లె గ్రామంలో నివాసమువుండే భోగిరెడ్డి పవన్‌కళ్యాణ్‌కుమార్‌రెడ్డి ట్రాక్టర్ వర్కర్‌గా పని చేస్తూ జీవనం సాగించేవాడు. అదే విధంగా గురువారం యర్రబల్లె గ్రామానికి ట్రాక్టర్లులో వెళ్తుండగా ప్రమాదవశాత్తు బోల్తాపడి ట్రాక్టర్ పెద్ద టైర్లు కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విద్యాసాగర్ తెలిపారు.