క్రైమ్/లీగల్

సెల్‌ఫోన్ తీసివ్వలేదని యువకుడి ఆత్మహత్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనగలూరు, మే 4: మండలంలోని కంబాలగుంటకు చెందిన కోనేరు శేఖర్ (15) అనే విద్యార్థి గురువారం ఉదయం గుళికల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ నాయక్ తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. శింగారెడ్డిపల్లె పంచాయతీ కంబాలగుంటకు చెందిన వెంకటేశ్ కుటుంబం నివాసం ఉంది. వెంకటేష్ కుమారుడు శేఖర్ ఇంట్లో ప్రతి రోజు సెల్‌ఫోన్ కొనివ్వమని అల్లరి చేసే వాడు. తల్లిదండ్రులు సెల్‌ఫోన్ కొనుగోలు చేయకపోవడంతో వారిని బెదిరించేందుకు గుళికల మందు తిని మృతి చెందాడు. గతంలో కోనేరు శేఖర్ సోదరుడు కడుపునొప్పితో మృతి చెందినట్లు తెలిసింది. మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టమ్ నిమిత్తం పంపినట్లు హెచ్‌సి నాయక్ తెలిపారు.