క్రైమ్/లీగల్

అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 24: ఉన్నత చదువులు చదివి, పలుచోట్ల ఉద్యోగాలు చేసి సులభంగా ధనార్జనకు ఆశపడి, అనేకసార్లు పోలీసులకు చిక్కి జైలు శిక్ష అనుభవించినప్పటికీ తిరిగి చోరీలకు పాల్పడుతున్న కడప జిల్లా, సింహాద్రిపురం మండలం, రావులకొలను గ్రామానికి చెందిన ఉప్పలూరి నాగేశ్వరరెడ్డి అనే పాత నేరస్థుడిని క్రైం సీఐ రసూల్‌సాహెబ్, ఆయన సిబ్బంది బుధవారం అరెస్టు చేశారు. ఈసందర్భంగా రూ.60వేలు విలువచేసే కేజీ 400 గ్రాములు బరువున్న వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈనేపథ్యంలో స్థానిక క్రైం పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ కడప జిల్లాకు చెందిన ఉప్పలూరి నాగేశ్వరరెడ్డి పులివెందుల్లోని లయోలా పాలిటెక్నిక్ కళాశాలలో మైనింగ్ కోర్సులో డిప్లొమా చేశారన్నారు. 2008లో లాల్‌గూడా రైల్వేస్టేషన్‌లో సెక్షన్ ఇంజినీర్‌గా పనిచేశాడని, 2009లో పులివెందులలోని యురోనియం కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగం రావడంతో రైల్వేశాఖలో ఉద్యోగం మానేశాడని చెప్పారు. అనంతరం 2010లో విజయవాడలో తన మిత్రుడితో కలిసి ‘అభి బస్’ టికెట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. ఇందులో పులివెందులకు చెందిన జనార్థన్ రెడ్డి, రవితేజ, హర్షవర్థన్ రెడ్డి, మనోహర్ కుమార్, హైదరాబాదుకు చెందిన సిహెచ్ రమేష్, సింహాద్రిపురానికి చెందిన శివకుమార్ రెడ్డిలను పనిలో పెట్టుకున్నారని తెలిపారు. వీరందరూ కలిసి ఏటీఎం యంత్రాల వద్ద నిఘావేసే వారని చెప్పారు. ఖాతాదారులు నగదు తీసుకునే సమయంలో వారి పిన్ నెంబర్లను చాకచక్యంగా తెలుసుకుని గుర్తు పెట్టుకునే వారని, ఆ నెంబర్ల ద్వారానే ఆన్‌లైన్లో బస్ టికెట్లను బుక్ చేసి ఏజెంట్ల ద్వారా వాటిని అమ్మించి సొమ్ము చేసుకునేవారని చెప్పారు. ఈక్రమంలో 2010 ఆగస్టులో వీరి కార్యాలయంలో పనిచేసే రవితేజ టికెట్లు అమ్ముతుండగా అనంతపురం పోలీసులు గుర్తించి అతనిచ్చిన సమాచారంతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారన్నారు. 2011లో మరోసారి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపితే 10 రోజుల్లో బెయిల్ తీసుకుని వెలుపలికి వచ్చారని ఆయన తెలిపారు. అదే సమయంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్నందుకు వీరిని సైబరాబాద్ సెంట్రల్ క్రైం పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపడంతో 3నెలలు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారన్నారు. అలాగే హైదరాబాదు సైబర్ క్రైం సీఐ వీరిలో పాతనేరస్థుడు నాగేశ్వరరెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపించారన్నారు. ఇక్కడ కూడా 15 రోజుల్లో బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడని తెలిపారు. ఇక బస్సు టికెట్ల వ్యాపారం చేస్తే పోలీసులకు చిక్కిపోతామని భావించి అదే తరహాల్లో ఇతర ఖాతాదారుల అకౌంట్‌లలోని డబ్బుతో సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణాలను కొని మార్కెట్‌లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటూ వచ్చారన్నారు. ఈకేసులో 2013లో హైదరాబాదు సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసి జైలుకి పంపారన్నారు. దీంతో సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించిన నాగేశ్వరరెడ్డి పాతకేసుల్లో శిక్షలను అనుభవించి 2014లో విడుదల అయ్యాడన్నారు. 2015లో యాక్సెస్ బ్యాంకు ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్ చేసి డ్రా చేస్తున్న సమయంలో బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారన్నారు. ఆ సమయంలో ఇంటి దొంగతనాలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైల్లో శిక్ష అనుభవిస్తున్న కర్ణాటక చిక్‌బళ్లాపూర్‌కు చెందిన శ్రీనాధరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డిలతో పరిచయాలు పెట్టుకున్నాడని డిఎస్పీ చెప్పారు. వీరంతా జైలు శిక్ష పూర్తి చేసుకుని విడుదలయ్యారన్నారు. ఈ సమయంలో నేరస్థుడు ఉమాశంకర్ రెడ్డి స్నేహితుడు రమేష్ అలియాస్ బిర్లాతో పరిచయం పెంచుకుని ఇంటి దొంగతనాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారన్నారు. బెంగళూరులో చోరీలకు పాల్పడితే పోలీసులకు దొరికిపోతామని భావించి తన స్నేహితుడైన గోపీ కారును తీసుకుని 2016 జనవరిలో తిరుపతికి వచ్చారన్నారు. వీరు వచ్చిన రోజున శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల పక్కన రెండిళ్లలోను, ఎన్జీఓ కాలనీలోని మరో ఇంటి తాళాలను పగులగొట్టి రూ. 27లక్షల సొత్తును చోరీ చేసుకుని పారిపోయారన్నారు. అనంతరం నాగేశ్వరరెడ్డి, రమేష్, ఉమాశంకర్‌రెడ్డిలు హైదరాబాదులో కేపీహెచ్‌బీ చోరీలకు పాల్పడతూ పోలీసులకు చిక్కారన్నారు. ఈ నేపథ్యంలో 2016లో తిరుపతిలో జరిగిన నేరాలకు సంబంధించి వారిని అరెస్టు చేసి వారి నుంచి కొంత సొమ్మును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపామన్నారు. అటు తరువాత నాగేశ్వర రెడ్డి పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతూ వచ్చాడని బుధవారం క్రైం పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచినట్లు డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి చెప్పారు. నాగేశ్వరరెడ్డిని పట్టుకోవడంలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన సీఐ రసూల్ సాహెబ్, టి.మధు ఇతర సిబ్బందిని అభినందిస్తూ వారికి రివార్డులు అందించాలని ఎస్పీ అభిషేక్ మహంతికి ప్రతిపాదనలు పంపామన్నారు.