క్రైమ్/లీగల్

అంతర్‌జిల్లా మోటారు సైకిల్ దొంగలు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ. 25లక్షల విలువైన 42 మోటార్‌సైకిళ్లు, మోపెడ్లు స్వాధీనం: అర్బన్ ఎస్పీ రాజకుమారి
రాజమహేంద్రవరం, మే 24: ఉభయ గోదావరిజిల్లాల్లో మోటారుసైకిళ్ల చోరీలకు పాల్పడే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి మొత్తం రూ. 25లక్షల విలువైన 42 మోటార్‌సైకిళ్లు, మోపెడ్లను స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ ఎస్పీ బి రాజకుమారి గురువారం క్రైం స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సత్యవాడకు చెందిన కుప్పాల రంగారావు గత 20ఏళ్లుగా చోరీలకు పాల్పడుతూ సుమారు 130 మోటారుసైకిళ్లు చోరీ చేశాడని చెప్పారు. రంగారావు, పెరవలి మండలం కానూరుకు చెందిన వీరమల్లు నాగేశ్వరరావుతో కలిసి రాజమహేంద్రవరంలోని పుష్కరాలరేవు, బొల్లినేని ఆసుపత్రి ప్రాంతాల్లో, రావులపాలెం, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నూజివీడు పట్టణాల్లో పలు చోరీలకు పాల్పడ్డారన్నారు. రంగారావు పలుసార్లు జైలుకు వెళ్లాడని ఎస్పీ తెలిపారు. గత ఏడాది ఆగస్టులో నూజివీడు సబ్‌జైలు నుంచి విడుదలై, మళ్లీ మోటారుసైకిళ్ల చోరీలు ప్రారంభించాడన్నారు. కొవ్వూరు మండలం వాడపల్లికి చెందిన కోరాడ వెంకటేశ్వర్లు 12 మోటారుసైకిళ్లు చోరీ చేశాడన్నారు. తాపీపని చేసే వెంకటేశ్వర్లు వ్యసనాలకు బానిసై, సులువుగా డబ్బు సంపాదించేందుకు చోరీల బాటపట్టాడని ఎస్పీ వివరించారు. వీరు ముగ్గురూ పార్కు చేసిన మోటారుసైకిళ్లను మారుతాళాలతో దొంగిలించి, తక్కువ ధరకు విక్రయించేవారని పేర్కొన్నారు. విలేఖర్ల సమావేశంలో క్రైం డిఎస్పీ ఎ త్రినాధరావు, మధ్యమండలం డిఎస్పీ జె కులశేఖర్, తూర్పు మండలం డిఎస్పీ యు నాగరాజు, సిఐలు పి మురళీకృష్ణారెడ్డి, ఎం రవీంద్ర, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. మోటారుసైకిళ్ల చోరులను అరెస్టు చేసేందుకు కృషిచేసిన క్రైం డిఎస్పీ, సిఐ, వారి సిబ్బందిని ఎస్పీ అభినందించారు.