క్రైమ్/లీగల్

క్రికెట్ బుక్కీల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 24: తెనాలి పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న గుంటి వెంకట్‌తో పాటు ఐదుగురు సబ్ బుక్కీలను అరెస్ట్ చేసినట్లు రూరల్ ఎస్‌పి సిహెచ్ వెంకటప్పల నాయుడు తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయం ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెనాలి పట్టణానికి చెందిన గుంటి వెంకట్, విజయవాడకు చెందిన ప్రధాన బుక్కీ వద్ద నుండి సబ్ బుక్కీగా ఐదుగురిని ఏర్పాటు చేసుకుని క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నాడు. బెట్టింగ్ గురించి వేమూరు మండలం, జంపని గ్రామానికి చెందిన పఠాన్ షరీఫ్‌ఖాన్ ఇచ్చిన సమాచారం మేరకు తెనాలి డిఎస్‌పి పర్యవేక్షణలో వన్‌టౌన్ సిఐ శ్రీనివాసరావు దర్యాప్తు నిర్వహించి గుంటి వెంకట్‌తో పాటు చైనా సాంబశివరావు, కనపర్తి రత్నరాజు, పెరికం మణికృష్ణ, కళ్లం వెంకటరెడ్డి, పోలిశెట్టి శ్రీరామ్‌లను ఈనెల 23వ తేదీ రాత్రి 12 గంటల సమయంలో అదుపులోకి తీసుకుని 5,55,000 రూపాయల నగదు, 18 స్మార్ట్ ఫోన్‌లు, 14 సాధారణ ఫోన్‌లు, టివి, 950 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడైన గుంటి వెంకట్ బెట్టింగ్‌లను ప్రోత్సహించేందుకు ఇన్‌స్టెంట్‌గా గంజాయి కూడా విక్రయిస్తుంటాడని తెలిపారు. వీరిపైనే కాకుండా బెట్టింగ్‌లు కాసిన 18 మందిపై కూడా కేసులు నమోదు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌పి వెల్లడించారు.