క్రైమ్/లీగల్

ఎస్పీ ఎదుట లొంగిపోయిన ఇద్దరు మావోయిస్ట్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 24: మావోయిస్ట్ ఈస్ట్ డివిజన్‌లోని పెదబయలు దళానికి చెందిన మహిళతో సహా ఇద్దరు మావోయిస్ట్‌లు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ఎదుట గురువారం లొంగిపోంది. మావోయిస్ట్ దళ సభ్యులుగా పనిచేస్తున్న గొల్లూరి సరయి (25) అలియాస్ భాను, చిన్ని ఎస్పీ ఎదుట లొంగిపోయింది. సరయి 2009లో మావోయిస్ట్ దళంలో చేరి, విప్లవ గీతాలు ఆలపిస్తుండేది. 2010లో ఆమెను జెఎన్‌ఎం పార్టీకి డిప్యూటీ కమాండర్‌గా నియమించారు. 2011లో మావోయిస్ట్ నాయకుడు గణేష్ మరణం తరువాత సరయిని పెదబయలు దళానికి బదిలీ చేశారు. అప్పటి నుంచి 2014 వరకూ దళ సభ్యురాలిగా పనిచేసింది. 2015-18 వరకూ మిలీషియా సభ్యురాలిగా పనిచేసింది. 2014లో సరయి అదే దళంలోని గొల్లోరి బంగారు అలియాస్ కృష్ణతో ప్రేమలో పడింది. వీరిద్దరూ వీరి ప్రేమ వ్యవహారాన్ని మావోయిస్ట్ నాయకుడు గణేష్‌కు తెలియచేశారు. ఆ తరువాత వారిని దళం నుంచి తొలగించి, మిలీషియా సభ్యులుగా ఉండమని ఆదేశించారు. 2015లో వీరిద్దరూ దళం నుంచి బయటకు వచ్చి, మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ చాలా సార్లు పోలీసులకు లొంగిపోవాలని భావించినా సాధ్యం కాలేదు. దాంతో వారు నివసిస్తున్న తగ్గుపాడు గ్రామాన్ని వదిలి ఒడిశాలోని చిత్రకొండ ప్రాంతానికి వెళ్లిపోయారు. చివరకు ఈ ఏడాది ఏప్రిల్ 26న వీరిద్దరూ మల్కన్‌గిరి పోలీసులకు లొంగిపోయారు. ఆ తరువాత కొంత కాలం చిత్రకొండలోనే జీవనం సాగించారు.
అలాగే, కోరుకొండ దళ సభ్యునిగా పనిచేస్తున్న వంతల రామచంద్రరావు కూడా ఎస్పీ ఎదుట లొంగిపోయాడు. రామచంద్రరావు దళంలో పనిచేస్తున్నప్పుడు మంజుల అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. 2004లో ఏఓబీలో జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్ట్‌లు చనిపోయిన సమయంలో రామచంద్రరావు మిలిషియా సభ్యునిగా పనిచేసేవాడు. కోరుకొండ దళ నాయకుడు నరేంద్ర కింద ఈయన మిలీషియా సభ్యునిగా 2014 వరకూ కటాఫ్ ఏరియాలో పనిచేశాడు. రాళ్లగెడ్డ ఎస్సార్ పైప్‌లైన్ల ధ్వంసం చేసిన ఘటనలో రామచంద్రరావు పాల్గొన్నాడు.