క్రైమ్/లీగల్

హత్యకేసులో ఐదుగురు నిందితులు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములకలచెరువు, మే 25: పెద్దమండ్యం మండలం, చెరువుకిందపల్లె వద ఈనెల 14న జరిగిన నాగమల్లప్పనాయుడు(50) హత్యకేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్‌చేసి శుక్రవారం రిమాండ్‌కు పంపినట్లు సిఐ రుషికేశవ వెల్లడించారు. సిఐ రుషికేశవ కథనం మేరకు వివరాలిలా వున్నాయి. పెద్దమండ్యం మండలం, పాపేపల్లెకు చెందిన నాగమల్లప్పనాయుడు(50) అదే మండలం, ముసలికుంటకు చెందిన పెద్దవెంకటరమణ(46), చిన్నవెంకటరమణ(39) బండ్రేవుకు చెందిన మహేష్(29), కురబలకోట మండలం, గౌనివారిపల్లాకు చెందిన లక్ష్మన్న(34), బి.కొత్తకోట మండలం, నల్లంకివారిపల్లెకు చెందిన గంగరాజులు(32) కలిసి గత కొనే్నళ్లుగా అక్షయ పాత్ర(రైస్ పుల్లింగ్) తమ వద్ద ఉందని అమాయకులను నమ్మించి మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఈమధ్య కాలంలో హత్యకు గురైన నాగమల్లప్పనాయుడుతో వీరికి విబేధాలు వచ్చాయి. వీరి మోసంపై నాగమల్లప్పనాయుడు పులువురికి చెప్పినట్లు వారి దృష్టికి వెళ్ళడంతో అంతం చేయాలని కక్ష కట్టారు. ఈ క్రమంలో ఐదుమంది కలిసి చెరువుకిందపల్లె సమీపంలోని పొలాల్లోకి తీసుకువెళ్ళి మధ్యం తాపించి కట్టెలతో దాడి చేసి హాతమార్చారు. మృతుడు నాగమల్లప్పనాయుడు అన్న సిద్దమల్లప్పనాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను గుర్తించారు. శుక్రవారం వీరు ఐదుగురు పెద్దమండ్యం విఆర్‌వో భరత్‌నాయక్ వద్ద లొంగిపోయారు. అనంతరం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుండి కట్టెలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు ఈశ్వరయ్య, శంకర్‌మల్లయ్య, సిబ్బంది శ్రీకాంత్, శిరాజ్, వెంకటేష్, బాస్కర్ తదితరులు పాల్గొన్నారు.