క్రైమ్/లీగల్

జంట హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మే 25: గుడిపాల మండలం పానాటూరు క్రాస్ వద్ద ఈనెల 11వ తేదిన జరిగిన జంట హత్యల కేసులను చిత్తూరు జిల్లా పోలీసులు ఎట్టకేలకు చేధించారు. ఈ జంట హత్యలు జిల్లాలోకలకలం సృష్టించాయి. ఈ హత్యకు పాల్పడింది చెన్నై నగరంలో పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ సీజింగ్ రాజా గ్యాంగ్‌గా పోలీసులు నిర్దారించారు. ఎట్టకేలకు ఈఘటనలో ప్రధాన నిందితుడు అయిన అతని అనుచరులైన సతీష్, వినోద్‌లను అరెస్ట్ చేసి ఫిస్టల్‌తోపాటు క్వాలీస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు వివరాల మేరకు చెన్నై పట్టణానికి చెందిన సీజింగ్ రాజా(43) ముందుగా ఆటో కన్సల్టింగ్ ఏజెన్సీ పెట్టుకొని వాహన దారులు బకాయిలు చెల్లించకపోతే ఆ వాహనాలను బలవంతంగా తీసుకెళ్లి సీజ్ చేయడంతో అతనిని సీజింగ్ రాజాగా పేరు వచ్చినట్లు తెలిపారు. చెన్నైలో సతీష్‌తోపాటు మరికొంత మందిని గ్యాంగ్‌గా ఏర్పాటు చేసుకొని భూకజ్జాలు, సెటిల్‌మెంట్‌లు చేస్తూ అనధికాలంలోనే కోట్లాది రూపాయల ఆస్థులను కూడగట్టాడు. చెన్నై నగరంలో పలు కంపెనీల నుంచి నెలవారి మామూళ్లను వసూలు చేస్తూ గూంఢాగా చలామణి అవుతూ వచ్చాడు. ల్యాండ్ సెటిల్‌మెంట్ వ్యవహారంగా సీజింగ్ రాజాకు చెన్నైలో పలువురు శత్రువులయ్యారు. దీంతో తనకు ప్రాణహాని ఉందని 2013లో చిత్తూరు నగరానికి వచ్చి ఇంటిని అద్దెకు తీసుకొని ఇక్కడే కాపురం పెట్టాడు. అనంతరం చిత్తూరు నగరవాసిగా రేషన్, ఆధార్ కార్డు పొంది తరచూ చెన్నైకు వెళ్లి వస్తుండేవాడు. ఇటీవల చిత్తూరులో ఇంటిని ఖాళీ చేసి చెన్నైలో స్థిరపడ్డాడు. 2001 నుంచి సీజింగ్ రాజా చెన్నై నగరంలో దాదాగిరి చేస్తూ గూండాగా చలామణి అవుతున్న క్రమంలో ఇతనిపై సుమారు 33 కేసులు నమోదైయ్యాయి. ఇందులో ఆరు హత్య కేసులతో పాటు ఐదు హత్యాయత్నం కేసులు, కిడ్నాప్ తదితర కేసులు ఉన్నాయి. గూండా యాక్టు కింద ఇప్పటికే ఐదు సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. సీజింగ్ రాజా, సతీష్‌లు చెన్నై నగరంలో తగాదాలో ఉన్న స్థల యజమానులను బెదిరించి అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి విక్రయించేవాడు. చెన్నైకు చెందిన అశోక్‌కుమార్ పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో చెన్నై నగరంలో సీజింగ్ రాజా, అశోక్‌లు కలసి తగాదాలో ఉన్న స్థలాన్ని మూడు కోట్లకు కొనుగోలు చేశారు. అనంతరం ఈ స్థలాన్ని పది కోట్లకు విక్రయించారు. ఈ డబ్బుల విషయంగా సీజింగ్ రాజా, అశోక్‌ల మధ్య వివాదం నెలకొంది. ఏదో ఒక విధంగా అశోక్‌కుమార్‌ను హత్య చేయాలని పథకం పన్నారు. ఈనెల 10వ తేదిన అశోక్, గోపి ఒక హత్య కేసులో తిరువళ్లూరు కోర్టుకు వెళ్లగా దీనిని అదునుగా భావించి సీజింగ్ రాజా తన ప్రధాన అనుచరుడు అయిన సతీష్ ద్వారా వీరిని కిడ్నాప్ చేశారు. అనంతరం వీరిరువురిని దారుణంగా హింసించి అనంతరం హత్య చేసి మృత దేహాలను ఓ వాహనంలో తీసుకువచ్చి తమిళనాడు సరిహద్దు అయిన చిత్తూరు జిల్లా పానాటూరు సమీపంలో పడేసి వెళ్లారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా పోలీసులు ఈ కేసును సీరీయస్‌గా తీసుకొని మృతులు తమిళనాడు వాసులుగా గుర్తించి నిందితుల కోసం ప్రత్యేక బృందాలను తమిళనాడుకు పంపడం జరిగింది. ఈ హత్య కేసు తనపై రాకూడదన్న భావించిన సీజింగ్ రాజా తన అనుచరులైన ఐదుగురిని చిత్తూరు కోర్టులో లొంగిపోయే విధంగా వ్యూహం పన్నాడు. ఈ ఐదుగురిని ఎవరైనా అడ్డుతగిలితే వారిని హత్య చేయడానికి తన అనుచరుడైన వినోద్‌ను రంగంలోకి దించాడు. ఇతనికి తుపాకి ఇచ్చి అడ్డుతిరిగే వారిని హతమార్చాలని సూచించాడు. ఈ విషయాన్ని పసిగట్టిన చిత్తూరు పోలీసులు చాకచక్యంగా ఈ ఐదుగురిని పట్టుకోవడంతో సీజింగ్ రాజా వ్యవహారం వెలుగు చూసింది. పది రోజులపాటు తమిళనాడులో జల్లెడ పట్టడంతో ఈ వ్యవహారం కొలిక్కి వచ్చినట్లు అయ్యింది. ఈనేపథ్యంలో శుక్రవారం గుడిపాల మండలం చీలాపల్లి క్రాస్ వద్ద క్వాలీస్ వాహనంలో సీజింగ్ రాజా, సతీష్‌లు వెళ్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వలపన్ని పట్టుకున్నట్లు తెలిపారు. సతీప్‌పై కూడా చెన్నైలో ఏడు కేసులు ఉన్నట్లు చెప్పారు. ఈ హత్య కేసులో ముద్దాయిలైన కనక, సజిత్, అరవింద్‌లను అరెస్ట్ చేయాల్సి ఉందని ఎస్పీ తెలిపారు. ఈకేసును చేధించిన జిల్లా పోలీసులకు ఎస్పీ రివార్డు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎఎస్పీ రాధిక, డీఎస్పీలు సుబ్బారావు, రామకృష్ణ, సీ ఐ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.