క్రైమ్/లీగల్

షార్ ఉద్యోగ కాలనీలో వినూత్నరీతిలో చోరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, మే 25: షార్ కాలనీ అయిన పులికాట్ నగర్ (డీఆర్‌డీఎల్)లో మూడు రోజులుగా గుర్తు తెలియని వ్యక్తి వినూత్నరీతిలో చోరీలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా గ్యాస్ స్టౌ వెలిగించి దానిపై ఏదైన గుడ్డను తగలపెట్టి వెళ్తున్నాడు. వరుసగా మూడు రోజులు మూడు ఇళ్లల్లో ఇదేవిధంగా జరగడంతో ఆ కాలనీలో నివాసం ఉంటున్న షార్ ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. పోలీసుల సమాచారం మేరకు డీఆర్‌డీఎల్ కాలనీలో బి48లో నివాసం ఉంటున్న నాగరాజు, సీ2 212లో ఎన్ రమేష్ అనే ఉద్యోగుల ఇంట్లో గురువారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లో చొరబడి బీరువాలో ఉన్న రూ.12వేలు నగదు అపహరించుకెళ్లాడు. చోరీకి పాల్పడడమే కాకుండా ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్‌ను ఆన్‌చేసి మండించి ఆ స్టవ్‌పై పక్కనే ఉన్న గుడ్డను వేసి వెళ్లారు. సాయంత్రం అంతరిక్ష కేంద్రం షార్‌లో విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి వచ్చిన ఉద్యోగి నాగరాజు స్టవ్ మండి ఉండటాన్ని గమనించి ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు.
విషయాన్ని పక్కనే ఉన్న ఇరుగుపొరుగు తోటి ఉద్యోగులకు విషయాన్ని చెప్పారు. వెంటనే అక్కడున్న ఉద్యోగులందరు ప్రధాన గేట్ వద్దకు చేరుకొని అక్కడ భద్రత విభాగంలో ఉన్న సెక్యూరిటీ వారిని ఎవరైన కొత్త వ్యక్తులు కాలనీలోకి వచ్చారా సీసీ కెమెరాల్లో చూడమన్నారు. ఇదే సమయంలో బి4 81నివాసం ఉంటున్న ఉదయార్క్ ఇంట్లోకి అదే వ్యక్తి చొరబడి చోరీకి విఫలయత్నం అయ్యాడు. అంటే గంట వ్యవధిలోనే జరిగి ఉండడంతో ఎవరో కాలనీలో ఉన్న స్థానికుల పనిగానే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విధంగా బుధవారం ఓ ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. చోరీలు సరే గ్యాస్ స్టవ్‌లను ఎందుకు మండిస్తున్నారో అంతుబట్టడం లేదు. చుట్టుపక్కల, పక్కనే నివాసం ఉంటున్న ఉద్యోగులు గ్యాస్ పేలి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదని భయాందోళన చెందుతున్నారు. ఎవరు అగంతకుండు ఎందుకు వినూత్న చోరీలకు పాల్పడుతున్నారో అంతుబట్టని విషయంగా మారింది. ఎస్సై ఇంద్రసేనారెడ్డి ఉద్యోగుల ఫిర్యాదు మేరకు చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.