క్రైమ్/లీగల్

మామిళ్లపల్లిలలో యువకుని కిడ్నాప్ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతమాగులూరు మే 25: సంతమాగులూరు మండలం మామిళ్లపల్లిలో ఒక యవకుని అగంతకులు కిడ్నాప్ చేశారనే వార్త కలకలం రేపింది. కిడ్నార్ల చెరనుండి కొద్ది గంటల్లోనే యువకుడు తప్పించుకు వచ్చానని లేకుంటే తనను వారు ఏమిచేసేవారోననే ఆందోళనను బాధితుడు వ్యక్తపరుస్తున్నాడు.కొమ్మాలపాడు వద్ద బుధవారం కిడ్నాప్ జరినట్లు తెలుపుతున్న ఈ కిడ్నాప్ కథనం శుక్రవారం వెలుగు చూసింది. మామిళ్లపల్లికి చెందిన మురికిపూడి సుభాష్ (25)(బద్రి) గత బుధవారం కొమ్మాలపాడు వద్ద రోడ్డు మార్జిన్ లో మూత్ర విసర్జచేసుకునేందుకు వెళ్లగా అప్పటికే మాటు వేసి వున్న అగంతకులు సుభాష్‌కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి కారులో విజయవాడ వరకు తరలించి అక్కడ వారు భోజనం చేసేందుకు కారుదిగి వెళ్లగా సుభాస్ కారునుండి తప్పించుకుని పొలాల్లో గుండా పారిపోయి లారీ ఎక్కి గురువారం వేకువజాముకు అద్దంకి మండలం మణికేశ్వరం చేరినట్లు ఆయన కుటుంబ సభ్యులకు బాధితుడు తెలిపాడు. బాధితుని కథనం ప్రకారం. అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామానికి చెందిన మురికిపూడి సుబాష్ (బద్రి) కి మామిళ్లపల్లి గ్రామానికి చెందిన జానకితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. అప్పటినుండి సుభాష్ అతని భార్య జానకి మామిళ్లపల్లిలో నివాసముంటూ కూలి పనులు చేసుకుని జీవిస్తున్నారు.వారికి ఇద్దరు మగ సంతానం. కాగా సుభాష్ బుధవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో సుభాష్ గెడ్డం చేయుంచుకునేందుకు కొమ్మాలపాడు వెళ్లాడు. అక్కడ ఓమ్ని కారు ఆగి ఉందని, అందులోనుంచి వృద్ధుడు దిగి కారులో బ్యాగు తనకివ్వమని వేడుకున్నాడన్నారు. బ్యాగు కోసం కారు వద్దకు వెళ్లగా అప్పటికే అందులో ఉన్న నలుగురు తనకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి బలవంతంగా కారులో ఎక్కించారన్నారు. అయితే తనకు మత్తు సరిగ్గా ఎక్కకపోవడం వల్ల మత్తు నటించి వారి మాటలన్నీ విన్నానన్నాడు. విజయవాడ వద్ద భోజనం చేయడానికి రాత్రి 9గంటల ప్రాంతంలో కారు ఆపి వారు హోటల్‌కు వెళ్లగా తాను తప్పించుకుని పొలాల్లోకి వెళ్లి అక్కడనుంచి లారీ ఎక్కి సత్తెనపల్లి వరకు వచ్చి అక్కడనుండి నరసరావుపేట మీదుగా అద్దంకి మీదుగా తన స్వగ్రామమైన ముణికేశ్వరం చేరినట్లు బాధితుడు చెప్పాడు. విషయం గురువారం సాయంత్రానికి మామిళ్లపల్లి లోని భార్య జానకి వారి బందవులకు తెలియడంతో అందరూ ఆందోళనచెందారు విషయం శుక్రవారం మద్యాహ్ననానికి మామిళ్లపల్లిలో కలకలం రేపింది.. భార్య జానకి హుటా హుటీన మణికేశ్వరం లోని తన భర్త వద్దకు వెళ్లింది. కాగా తమ అల్లుడు చాక చక్యంతో అగంతకుల నుండి తప్పించుకుని క్షేమంగా ఇల్లు చేరినందుకు అత్త మామలు వీరయ్య రోహిణి భార్య జానకి ఇతర బంధువులు ఆనందం వ్యక్తపరిచారు.
సుభాష్ కిడ్నాప్ ఉదంతం పై పలు సందేహలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ కిడ్నాప్ కు కారణమేంటి ?, కిడ్పాప్ నుండి తప్పించుకున్న సుభాష్‌గాని వారి కుటుంభ సభ్యులు గాని పోలీసు కేసుందకు నమోదు చేయలేదు ? అనే సందేహలు తలెత్తుతున్నాయి. ఈవిషయమై పోలీసులను వివరణ కోరగా కిడ్నాప్ విసయమై తమకెలాంటి ఫిర్యాదు అందలేని చెప్పారు. బాధితులు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు జరిపుతామని తెలిపారు.