క్రైమ్/లీగల్

రైతుబంధు డబ్బుల కోసం వచ్చి మృత్యువాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమనగల్లు, మే 25: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం కింద చెక్కు డబ్బులను తీసుకునేందుకు వచ్చిన తల్లీతనయుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం అవురుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నల్లవారిపల్లి గ్రామానికి చెందిన రుద్రక్ష మల్లమ్మ(65), రుద్రక్ష నర్సింహా(46)కు ఇటీవల రైతుబంధు పథకం క్రింద చెక్కులు అందుకున్నారు. చెక్కుల డబ్బులు తీసుకునేందుకు ఆమనగల్లు పట్టణంలోని అంధ్రా బ్యాంకుకు చేరుకున్నారు. ఇక్కడ ఇవ్వడం కుదరదని ఎదురుగా ఉన్న ఎస్‌బీఐ బ్యాంకుకు వెళ్లాల్సిందిగా సిబ్బంది సూచించారు. తల్లీతనయుడు హైదారాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి దాటి ఎస్‌బీఐ బ్యాంక్ వైపు వెళ్తుండగా మిషన్ భగీరథ పైపుల క్రేన్ హఠాత్తుగా ఢీకొట్టడంతో మల్లమ్మ అక్కడిక్కడే మృతిచెందగా, త్రీవంగా గాయపడిన నర్సింహను హైదారాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఆమనగల్లు ఎస్సై మల్లేశ్వర్ దర్యాప్తు చేస్తున్నారు.