క్రైమ్/లీగల్

జాతి పరువుతీశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 25: ‘ఈ కేసు చారిత్రక నష్టం. భారత జాతికే అవమానం’ అంటూ 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై ఢిల్లీ హైకోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (సీబీఐ) వ్యాఖ్యానించింది. 2జీ స్పెక్ట్రమ్ కేసులో కేంద్ర టెలికాం మాజీ మంత్రి ఏ రాజా, డీఎంకె ఎంపీ కనిమొళి తదితరులు అభియోగాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాము నిర్దోషులమంటూ కోర్టులో సవాల్ చేసిన డీఎంకే నేతలను ఉద్దేశించి అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహదా హైకోర్టులో వాదనలు వినిపిస్తూ స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణం కారణంగా ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లిందన్నారు. జస్టిస్ ఎస్‌పి గార్గ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తూ ‘ఈ కుంభకోణం దేశానికి చారిత్రక నష్టం.
జాతికి తీరని అవమానం’ అని వ్యాఖ్యానించారు. ఈ భారీ కుంభకోణంలో తమ వాదనలు వినిపించేందుకు నిందితులు మరింత గడువు కోరుతుండటం ‘కేసు ముందుకు సాగకుండా ఆలస్యం చేయడానికి చేస్తోన్న కుట్ర’ అని వాదించారు. 2జీ స్పెక్ట్రమ్ కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు ద్వారా దాఖలు చేసిన సీబీఐ పిటీషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటీషన్ విచారణను ఆగస్టు 2కి వాయిదా వేస్తూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పిటీషన్‌ను ఆగస్టు 6న విచారించేందుకు నిర్ణయించింది. ఇదిలావుంటే కేసులో లెక్కలేనన్ని చార్జిషీట్లు ఫైల్ చేసిన నేపథ్యంలో, వాటిని విడివిడిగా విచారించాలని నిందితుల తరఫున లాయర్లు కోర్టుకు విన్నవించారు.
నిందితులు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటూ ప్రత్యేక కోర్టు ద్వారా సీబీఐ పిటీషన్ దాఖలు చేసిన నేపథ్యంలో, ఇప్పటికే హైకోర్టు మాజీ కేంద్ర మంత్రి ఏ రాజా, ఎంపీ కనిమొళికి నోటీసులు జారీ చేయడం తెలిసిందే. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటీషన్‌పైనా జస్టిర్ గార్గ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇదేతరహా ఆదేశాలను జారీ చేయడం తెలిసిందే.
భారీ కుంభకోణంలో ఇడీ అటాచ్ చేసిన 223 కోట్ల రూపాయల ఆస్తులను యథాతథంగా కొనసాగించేందుకు వీలుగా మధ్యస్త పిటీషన్ దాఖలు చేయడానికీ ఇడీని కోర్టు అనుమతించింది.