క్రైమ్/లీగల్

లారీక్లీనర్ నిర్లక్ష్యానికి ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదకాకాకాని, మే 26: లారీక్లీనర్ అతిగా మద్యం సేవించి రాంగ్‌రూట్‌లో లారీ నడిపి ఇద్దరి మృతికి కారణమైనాడు. ఈ సంఘటన శనివారం మండల పరిధిలోని తక్కెళ్లపాడు గ్రామం వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నాదెండ్ల మండలం కనపర్తికి చెందిన చెవుల రామారావు (55), చెవుల పెదబాబు (25) శనివారం కనపర్తి నండి తాడేపల్లి వద్ద గల గుండిమెడ గ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. తక్కెళ్లపాడు వద్ద జాతీయ రహదారికి వచ్చే సరికి అతిగా మద్యం సేవించిన లారీ క్లీనర్ పిడతల శివ లారీతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. రామారావు, పెదబాబు తలలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. పెదకాకాని పోలీసులు క్లీనర్‌ను అదుపులోకి తీసుకుని కేసు విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.