క్రైమ్/లీగల్

బాలికపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, మే 27: నెల్లూరు మండల పరిధిలోని పొట్టెపాళెం గ్రామానికి చెందిన 11 సంవత్సరాల బాలికపై అదే ప్రాంతానికి చెందిన సయ్యద్ అవిషేర్ (42) ఆదివారం అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలిక ఆరుబయట ఉండగా తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉంటున్నవారు వెంటనే స్పందించి అతనికి దేహశుద్ధి చేసి రూరల్ పోలీసులకు అప్పగించారు. బాలికపై అత్యాచారం జరగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారిస్తున్నట్లు సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.