క్రైమ్/లీగల్

12మంది నక్సలైట్లు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, మే 28: చత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన బిజాపూర్ జిల్లాలో వేర్వేరుచోట్ల 12మంది నక్సలైట్లను అరెస్ట్ చేసినట్టు బిజాపూర్ ఎస్పీ మోహిత్ గార్గ్ వెల్లడించారు. బాసగూడ ఠాణా పరిధిలోని డాల్ల అటవీ ప్రాంతంలో ఆరుగురిని, బేద్రే ఠాణా పరిధిలో ఐదుగురుని, తర్నిచ్చిల్పత్పార అటవీ ప్రాంతంలో మరొకరిని అదుపులోకి తీసుకున్నట్టు గార్గ్ వెల్లడించారు. డాల్ల ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుపడిన మడ్కం హంగ (24), ఓయం మంగ్లు (26), కుంజం హంగ (45), పునెం బెండి (35), ఉయికా పోడియా (25), నుపో పండు (20)లను అదుపులోకి తీసుకున్నట్టు గార్గ్ వెల్లడించారు. వీరిలో నక్సల్స్ మిలటరీ ప్లాటూన్ 9లో క్రియాశీలకంగా పనిచేస్తున్న సభ్యుడు హంగ ఉన్నాడని, ఇతను కేంద్ర కమిటీలోని కీలక నేత సోనుకు గన్‌మన్‌గానూ పని చేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. మహారాష్టల్రోని గడ్చిరోలిలో అంబుజ్‌మడ్ వ్యూహన్ని అమలు చేసిన బృందంలో హంగ ఉన్నట్టు పోలీస్ అధికారులు వెల్లడించారు. అలాగే బేద్రే ఠాణా పరిధిలోని ముర్కినార్ ప్రాంతంలో సంచరిస్తూ చైతు కురసం (29), బోంజో పోయం (30), మాసా ఖుహరం (30), సుద్రం పోయం (22), బెట్టి జోగ (35) దొరికిపోయారని పోలీసులు వెల్లడించారు.