క్రైమ్/లీగల్

పట్టపగలు యువతి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: బంగారం దుకాణంలో పని చేస్తున్న 19 ఏళ్ల యువతిని గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు.ఈ సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రావుల పాలెంకు చెందిన ఒక కుటుంబం 9 ఏళ్ల నుంచి యూసఫ్‌గూడలో నివాసం ఉంటుంది. తండ్రి అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తూ ఇస్ర్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని కుమార్తె వెంకటలక్ష్మి జూబ్లీహిల్స్‌లోని జవహర్‌నగర్ ప్రాంతంలో ఉన్న బంగారం దుకాణంలో పని చేస్తోంది. సోమవారం ఆ దుకాణం యజమాని జ్యోస్న, ఆమె భర్త ఇద్దరూ వేరే ఊరు వెళ్లారు. మధ్యాహ్నాం 2 గంటల సమయంలో ఆకతాయిలు ఎవరో వచ్చి గొడవ చేస్తున్నారని యజమానికి ఫోన్ చేసింది. ఇంతలో నాలుగు గంటల సమయంలో ఒకరు షాపులోకి ప్రవేశించి యువతిపై దాడి చేసి బ్లేడ్‌తో గొంతుకోశాడు. దీంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వచ్చి పరిస్థితిని పరిశీలించారు. నిందితులు మృతురాలికి తెలిసిన వారై ఉండవచ్చని భావిస్తున్నారు. వీరిలో ఒకరు యూసఫ్‌గూడలోని ఆమె నివాసం వద్ద ఉంటూ తరచూ ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నట్లు పోలీసులు సమాచారం సేకరించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన ప్రదేశాన్ని క్లూస్ టీమ్స్ సందర్శించి ఆధారాలను సేకరించారు. సిసి ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.