క్రైమ్/లీగల్

ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మే 31: ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరిస్తూ కొన్ని సందర్భాల్లో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన ఆరుగురు సభ్యుల ముఠాను నెల్లూరు జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.1.30 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ ముఠా సభ్యులు ఎర్రచందనం అక్రమ రవాణా చేసే వాహనాలకు ముందుగా రహదారిపై పోలీసు యూనిఫాంతో పెట్రోలింగ్ నిర్వహిస్తూ మార్గం సుగమం చేసేవారని తెలిపారు. ఇందుకుగాను ఒక్కో వాహనం నుంచి రూ.1.50 లక్షలు వసూలు చేసేవారని చెప్పారు. నగదు ఇవ్వని వాహనాలను తామే హైజాక్ చేసి ఎర్రచందనాన్ని తమిళనాడుకు తరలించేవారని తెలిపారు. జిల్లా టాస్క్ఫోర్స్ బృందం ఈ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 35 ఎర్రచందనం దుంగలతోపాటు తుపాకులు, తూటాలు, కారు, లారీ, 800 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి వివరించారు.