క్రైమ్/లీగల్

సుప్రీం వరమిచ్చినా బెయలివ్వని కింది కోర్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 31: ‘దేవుడు వరం ఇచ్చినా పూజారి కనికరించలేదు’ అని అంటుంటారు. అలాంటిదే ఒకటి వెలుగుచూసింది. ఓ నిందితుడికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసినా, కింది కోర్టు అతడిని విడుదల చేయలేదు. గురువారం ఈ అంశం సుప్రీం కోర్టు విచారణకు వచ్చింది. దీనిపై తీవ్రంగా స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం మెజిస్టీరియల్ కోర్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబయి మెజిస్టీరియల్ కోర్టు పైకోర్టులా ఊహించుకున్నట్టుందని బెంచ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ మోహన్ ఎం శంతనాగౌడ్‌తో కూడిన ధర్మాసనం ముందుకు ఈ విచిత్రమైన కేసు వచ్చింది. తన క్లయింట్‌కు సుప్రీం కోర్టులో ఉపశమనం లభించిందని, బెయిల్ వచ్చినా మెజిస్టీరియల్ కోర్టు విడుదల చేయడం లేదని న్యాయవాది ఆరోపించారు. మే 17న సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు సందర్భంలో జరిమానా విషయం ప్రస్తావన లేదని నిందితుడి తరఫు న్యాయవాది బెంచ్ దృష్టికి తెచ్చారు. దీనిపై సుప్రీం ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘మేం (సుప్రీం కోర్టు) నిందితుడికి బెయిల్ మంజూరు చేశాం. అయితే అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ (ఏసీఎంఎం) మా ఆదేశాలు పట్టించుకోకుండా మాకన్నా ‘ఎక్కువ’ అనుకుంటున్నారు. పైగా బెయిల్ మంజూరు చేయడం సుప్రీం కోర్టుకు తెలియదన్నట్టు ప్రవర్తిస్తున్నారు’ అని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏసీఎంఎం తీరు తామే పైకోర్టు అన్న రీతిలో ఉందని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. బెయిల్ అవౌంట్ ఎంతో స్పష్టం చేయనందున సుప్రీం కోర్టు బెయిల్ చెల్లనేరదంటూ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తేల్చేశారు. ఈ మేరకు మే 21న ఆదేశాలు జారీ చేశారు. బెయల్ ఇవ్వడం ఎలాగో తమకు తెలియదన్నట్టు మెజిస్ట్రేట్ వ్యవహారం ఉందని సుప్రీం పేర్కొంది. మే 17న ఆర్‌ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఓ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. తనపై దాఖలైన కేసులో విచారణకు సహకరించాలని నిందితుడిని బెంచ్ ఆదేశించింది. తీరా చూస్తే కింద కోర్టు నిందితుడిని విడుదల చేయడానికి నిరాకరించింది.