క్రైమ్/లీగల్

సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు సమాయత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ, మే 31: దేశ భద్రతకు సైబర్ దాడులు పెనుసవాళ్లువిసురుతున్నాయని, కీలకమైన ఆర్థిక సంస్థలు, వ్యవస్థలకు ముప్పుగా పరిణమించాయని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ పేర్కొన్నారు. దేశీయ భద్రతపై గురువారం ఇక్కడ జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, భద్రతా ఏజన్సీలు సైబర్ దాడులకు దీటుగా బదులిచ్చేందుకు వీలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాలని కోరారు. భారతదేశం సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని, ఈ విషయంలో రాజీలేదన్నారు. సైబర్ దాడుల ప్రభావం ప్రపంచమంతా ఉందన్నారు. విద్యుత్, ఆర్థిక, వౌలిక సదుపాయాల సంస్థలకే కాకుండా అనేక ప్రాజెక్టులకు సైబర్ దాడులు సవాలుగా తయారయ్యాయన్నారు. సైబర్ టెక్నాలజీపై ఉన్నత స్థాయి అధ్యయనం జరగాలన్నారు. సైబర్ నేరాలను ప్రభుత్వం, ప్రైవేట్ ఏజన్సీలు ఉమ్మడిగా ఎదుర్కొనాలన్నారు. సైబర్ దాడులు జరుగుతాయనే విషయాన్ని ముందుగా పసిగట్టే సామర్థ్యం ఉండాలన్నారు. దీనిపై భద్రతా బలగాలకు శిక్షణ ఇవ్వాలన్నారు. సైబర్ దాడులకు పాల్పడే వారికి నిధులను, టెక్నాలజీని సమకూర్చే అంతర్జాతీయ శక్తులు ఉన్నాయన్నారు. హోంశాఖ గత కొన్ని సంవత్సరాలుగా సైబర్ దాడులపై నిరంతరం అధ్యయనం చేస్తోందన్నారు. సైబర్ దాడులను ఎదుర్కొనే టెక్నాలజీ నిపుణుల సహాయం తీసుకుంటుందన్నారు. సైబర్ దాడులకు పాల్పడే నేరగాళ్ల గణాంక వివరాలను రూపొందించాలన్నారు. వీరిని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా ఉన్న ఉత్తమ విధానాలను ఆచరించాలన్నారు. జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో గణాంక వివరాల ప్రకారం 2014లో 9622, 2015లో 11592, 2016లో 12317 సైబర్ క్రైమ్ నేరాలు దేశంలో నమోదయ్యాయి.