క్రైమ్/లీగల్

ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో పనిచేసే ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ గుంజా సామ్యూల్ ఏసుభక్త జోషువా అలియాస్ సామ్యూల్‌ను నగర సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీసీఎస్ డీసీపీ అవినాశ్ మహంతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ప్రైవేటు పాఠశాలలకు పిటిఓ, పిఆర్, ఈటిఆర్‌ఎస్‌ల జారీకి నకిలీ అనుమతులు ఇవ్వడంలో జరిగిన అవకతవకల్లో సామ్యూల్‌ను నిందితుడిగా గుర్తించిన సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. 14 ప్రైవేటు పాఠశాలలకు తాత్కాలిక గుర్తింపును కొనసాగించేందుకు నకిలీ అనుమతులు మంజూరు చేసినట్టు విచారణలో తేలింది. 2017-18 సంవత్సరంలో జరిగిన ఈ అవకతవకలపై విచారణ నిర్వహించారు. సీసీఎస్ ఏసీపీ కె.శ్రీనివాస్ రెడ్డి కేసు దర్యాప్తు చేశారు. నిందితుడిని ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పర్చడం ద్వారా రిమాండ్‌కు తరలించినట్టు డీసీపీ వెల్లడించారు.