క్రైమ్/లీగల్

పోలీసు కస్టడీకి సీజింగ్ రాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 1: జంట హత్య కేసులో ప్రధాన నిందితుడైన సీజింగ్ రాజాను శుక్రవారం చిత్తూరు పోలీసులు కస్టడీకి తీసుకొన్నారు. గత నెలలో తమిళనాడుకు చెందిన ఆశోక్ కుమార్, గోపిలను దారుణంగా హత్య చేసి, మృతదేహాలను తమిళనాడు సరిహద్దు అయిన గుడిపాల మండలం పానాటూరు వద్ద పడవేసిన సంగతి తెలిసిందే. ఈకేసును సీరియస్‌గా తీసుకొన్ని చిత్తూరు పోలీసులు రంగంలోకి దిగి ఆర్థిక లావాదేవీలే ఈ హత్యలకు కారణమని గుర్తించారు. ఈదిశగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తమిళనాడులో రౌడియిజం చేస్తూ ఆంధ్రా తమిళనాడు రాష్ట్రాల్లో అనేక హత్యలు కిడ్నాప్‌లకు పాల్పడిన గ్యాంగ్ స్టర్ సీజింగ్ రాజానేని ప్రధాన నిందితుడని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇటీవల చిత్తూరు సమీపంలో సీజింగ్‌రాజాను అతని అనుచరుడైన సతీష్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసు విచారణలో భాంగంగా సీజింగ్ రాజాను తమ కస్టడీకి ఇవ్వాలని చిత్తూరు పోలీసులు కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. కోర్టు అనుమతితో శుక్రవారం సీజింగ్‌రాజా, సతీషలను తమ కస్టడీకి తీసుకొన్నారు.