క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాచర్ల రూరల్, జూన్ 1: ప్రమాదవశాత్తు రెండు ద్విచక్ర వాహానలు ఢీ కొన్న సంఘటనలో భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం కంభంపాడు గ్రామ సమీపంలో జరిగింది. మాచవరం మండల పరిధిలోని మోర్జంపాడు గ్రామానికి చెందిన పూజల వెంకటేశ్వర్లు (30) మాచర్ల నుండి మోర్జం పాడు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు కంభంపాడు శివారులోని కుడికాలువ సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా వెంకటేశ్వర్లు బ్రేక్ కొట్టాడు. దీంతో వెనుక నుండి ద్విచక్ర వాహనంపై వస్తున్న వాహనం పూజల వెంకటేశ్వర్లు వాహనాన్ని ఢీ కొట్టడంతో రెండు వాహనాలు కింద పడిపోయాయి. సంఘటనా స్థలంలోనే పూజల వెంకటేశ్వర్లు మృతి చెందగా మరో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి హెల్మెట్ ధరించి ఉండటంతో స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఇన్‌చార్జి రూరల్ సీఐ ఎస్ సాంబశివరావు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం 108 ద్వారా మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.