క్రైమ్/లీగల్

ఆటో బోల్తా.. వృద్ధుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవుకు, జూన్ 1:అవుకు పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామాపురం గ్రామం ఎర్రరాళ్లవాగులో శుక్రవారం ఆటో బోల్తా పడిన సంఘటనలో చాకలి పెద్దరాముడు(63)మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. రామాపురం గ్రామానికి చెందిన చాకలి పెద్దరాముడు తన అల్లుడు రామ్మోహన్‌తో కలిసి అవుకు రిజర్వాయర్ వద్ద చాకలి మూటలను దింపడానికి ఆటోలో బయల్దేరారు. అయితే ఎర్రరాళ్లవాగు వద్ద ఎదురుగా వచ్చిన పందిని తప్పించబోయి అదుపుతప్పి ఆటో వాగులోకి పడిపోయింది. గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో 108 వాహన సిబ్బంది వచ్చి వారిని బనగానపల్లె ప్రభుత్వ వైద్యాశాలకు తరలించగా అప్పటికే పెద్దరాముడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వివాహిత మృతి
క్రిష్ణగిరి, జూన్ 1:విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మండల పరిధిలోని టి.గోకులపాడు గ్రామానికి చెందిన లక్ష్మిదేవి(43) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన లింగారెడ్డి భార్య లక్ష్మిదేవి గత రెండేళ్లుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతుండేది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది గత నెల 30వ తేదీ మొక్కజొన్న పంటకు పిచికారి చేసే విషపు గుళికలు మింగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను కర్నూలు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆమె చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ తెలిపారు.