క్రైమ్/లీగల్

రూ.2.13 కోట్ల నిధుల దుర్వినియోగం కేసులో.. ఇంజినీరింగ్ కళాశాల ఇద్దరు ఉద్యోగుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 1: స్కాలర్‌షిప్‌లు, మెస్ చార్జీల్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఇద్దరు ఉద్యోగులను ఎసిబి అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎసిబి డిజి కార్యాలయం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీలో స్కాలర్‌షిప్‌లు, మెస్ చార్జీల్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఆ కళాశాలకు చెందిన జూనియర్ అసిస్టెంట్ ఎ.ప్రభాకర్, మెస్ కేర్‌టేకర్, జూనియర్ అసిస్టెంట్ బి.శ్రీహరిని అరెస్టు చేసినట్లు ఎసిబి డిజి తెలిపారు. అరెస్టు చేసిన అనంతరం నిందితులను హైదరాబాద్ ఎసిబి కేసుల ప్రత్యేక న్యాయస్ధానంలో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఎసిబికి అందిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన అధికారులు రూ.2,13,55,443 నిధులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎసిబి పేర్కొంది.