క్రైమ్/లీగల్

బాలిక కిడ్నాప్ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 1: బాలిక కిడ్నాప్ అయిందంటూ కలకలం సృష్టించిన సంఘటన ఉప్పల్ పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టింది. వివరాల్లోకి వెళితే..నేపాల్‌కు చెందిన అనిత (17) ఉప్పల్ ఆదర్శనగర్‌లో ఉంటున్న తల్లి సంజన వద్దకు వారం రోజుల క్రితం వచ్చింది. సెలవుదినాల్లో ఎంజాయ్ చేయడానికి వచ్చిన బాలిక శుక్రవారం తెల్లవారుజామున బయటకు వెళ్లి అదృశ్యం అయింది. వాకింగ్ కోసం బయటకు వెళ్లిన బాలిక ఎక్కిడికి వెళ్లిందో తెలియక తల్లి కంగారు పడుతూ ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కిడ్నాప్ అయిందని టీవీ ఛానళ్లలో స్క్రోలింగ్ వస్తుండటంతో పోలీసులు ఆమెకోసం ఉరుకులు, పరుగులు పెట్టారు. నేపాల్ వెళ్లి ఉండవచ్చని ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నేపాల్ వెళ్లే ట్రైన్‌లలో విధులు నిర్వహించే ఆర్‌పీఎఫ్ పోలీసులను అలర్ట్ చేశారు.