క్రైమ్/లీగల్

రేవులో స్నానానికి వెళ్లిన యువకుడు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, జూన్ 1: ప్రమాదవశాత్తు కృష్ణా నది రేవులో స్నానానికి దిగిన ఇరువురు యువకుల్లో ఒకరు గల్లంతైన సంఘటన మండల పరిధిలోని కె.కొత్తపాలెంలో చోటు చేసుకుంది. మచిలీపట్నం గొడుగుపేటకు చెందిన కుండా నాగబాబు (18), జొన్నలగడ్డ నాగసాయి (18) కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం గ్రామంలో జరుగుతున్న శ్రీ అంకమ్మ తల్లి సంబరానికి వచ్చారు. సాయంత్రం సరదాగా ఇరువురు కృష్ణానది రేవులోకి దిగగా ప్రమాదవశాత్తు నాగబాబు గల్లంతయ్యాడు. గల్లంతైన నాగబాబు కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు రేవు వద్దకు వచ్చి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యల్లో పాల్గొనగా రాత్రి పొద్దుపోయే వరకు నాగబాబు ఆచూకీ తెలియరాలేదు.