క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లచెరువు, జూన్ 3: స్థానిక పెట్రోల్‌బంక్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తనకల్లు మండలం ఈతోడుకు చెందిన విశ్రాంత ఉద్యోగి శంకర్‌నారాయణ (68) మృతి చెందారు. వివరాలు ఇలా వున్నాయి. తనకల్లు మండలం ఈతోడుకు చెందిన శంకర్‌నారాయణ ద్విచక్ర వాహనంలో నల్లచెరువు నుంచి తనకల్లుకు వెళ్తూ మార్గమధ్యంలో వున్న పెట్రోల్‌బంక్ వద్ద పెట్రోలు పోయించుకుని రోడ్డుపైకి వస్తుండగా లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్‌బాబు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు.