క్రైమ్/లీగల్

రైలు ఢీకొని మహిళ మృతి.. బాలుడికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుగ్గిరాల, జూన్ 5: ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న సోదరుడిని పరామర్శించేందుకు వచ్చి ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో బుడంపుట్ల మల్లేశ్వరి అనే మహిళ మృతిచెందింది. మండల కేంద్రమైన దుగ్గిరాల చెన్నకేశవ నగర్‌లో ఉంటున్న అవధానం లక్ష్మయ్య ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో చూసేందుకు తెనాలి ఇస్లాంపేటకు చెందిన అతని సోదరి బుడంపుట్ల మల్లేశ్వరి (55) మంగళవారం మన మనవడైన సాయిని వెంట పెట్టుకుని వచ్చింది. చెన్నకేశవ నగర్‌లోని లక్ష్మయ్య ఇంటికి వెళ్లేందుకు గేటు వేసి ఉన్న రైల్వేగేటును దాటి వెళ్తుంది. అదే సమయంలో బెంగుళూరు వెళ్లే ఎక్స్‌ప్రెస్ వేగంగా వచ్చింది. గేట్‌మెన్ వాహనదారులు కేకలు వేసినప్పటికీ వినికిడిలోపం ఉన్న మల్లేశ్వరి మనవడితో కలిసి ముందుకు వెళ్లింది. వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టింది. సుమారు 60 అడుగుల వరకు ఇద్దర్నీ రైలు ఈడ్చుకెళ్లడంతో మల్లేశ్వరి అక్కడికక్కడే మృతిచెందగా బాలుడు సాయి తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని 108లో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు రైల్వే ఎస్‌ఐ కె వెంకయ్య సంఘటనా స్థలానికి వచ్చి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.