క్రైమ్/లీగల్

తాగుబోతు తండ్రి కొట్టడంతో కుమారుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర, జూన్ 5: మద్యానికి బానిసైన తండ్రి కుమారుడు దాచుకున్న డబ్బును మద్యం సేవించేందుకు తీసుకొని వెళ్ళగ కుమారుడు వెళ్ళి డబ్బులు ఇవ్వమని అడగగా అతనిని రోడ్డుపై తండ్రి కొట్టడంతో మనస్తాపానికి గురై కొడుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం మధిర మున్సిపాల్టీ పరిధిలోని మడుపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మడుపల్లికి చెందిన నీలం శ్రీనివాసరావు తాపీమేస్ర్తీగా పనిచేస్తూ మద్యానికి బానిసయ్యాడు ఇతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. శ్రీనివాసరావుప్రతిరోజు డబ్బుల కోసం ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడు. కుమారుడు శివకృష్ణ(15) మడుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 9వ తరగతి పూర్తి చేసాడు. వేసవి సెలవలలో క్యాటరింగ్ పనికి వెళ్ళగ వచ్చిన 2వేల రూపాయలను తాను చదువుకునే పుస్తకంలో దాచుకున్నాడు. శివకృష్ణ తండ్రి మంగళవారం ఆ డబ్బులను మద్యం తాగేందుకు తీసుకొని వెళ్తుండగా భార్య కృష్ణవేణి అడ్డుకున్నప్పటికి వినకుండా బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడే నిద్రలేచిన శివకృష్ణకు తండ్రి డబ్బులు తీసుకొని వెళ్ళిన విషయాన్ని తల్లి చెప్పడంతో శివకృష్ణ సెంటర్‌లో ఉన్న తండ్రి వద్దకు వెళ్ళి ఇంటికి రమ్మని బతిమలాడాడు. ఈ క్రమంలో రోడ్డుపైనే శ్రీనివాసరావు కుమారుడిని కొట్టడంతో మనస్తాపానికి గురైన శివకృష్ణ ఇంటికి వచ్చి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదువులో శివకృష్ణ చిన్నతనంనుంచే ప్రతిభను చాటుతూ నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యాడు. శివకృష్ణ చనిపోవడంతో ఆ పాఠశాల ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. తండ్రి మద్యానికి బానిస కావడం వలన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.