క్రైమ్/లీగల్

నిధుల దుర్వినియోగం కేసులో నిందితురాలు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, జూన్ 5: స్ర్తినిధి నిధుల దుర్వినియోగం కేసులో నిందితురాలు కొల్లి అరుణను ఎట్టకేలకు మంగళవారం అరెస్టు చేశారు. మహిళ సాధికారిత ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్ర్తి నిధి క్రెడిట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ ఏర్పాటు చేయగా తొలి నాళ్లలోనే చల్లపల్లి మండల స్ర్తి నిధిలో మోసానికి తెరతీశారు. మండల పరిధిలోని మంగళాపురం గ్రామానికి చెందిన యెహోవా, వెంకటేశ్వర అనే రెండు గ్రూపుల సభ్యులకు తెలియకుండా కొల్లి అరుణతో సహా ఆరుగురు మోసానికి పాల్పడ్డారు. సభ్యులకు తెలియకుండా నిందితులు స్ర్తి నిధి రుణాలను పక్కదారి పట్టించడంతో బకాయిలు చెల్లించాలని సభ్యులకు సంబంధిత అధికారులు తాకీదులు జారీ చేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది. విచారించిన అధికారులు అక్రమానికి పాల్పడిన వారిని తిరిగి జమ చేయాలని ఆదేశించటంతో ఒప్పుకుని జమ చేయకుండా కాలయాపన చేస్తుండటంతో స్ర్తి నిధి డిప్యూటీ జనరల్ మేనేజర్ టిఎస్ శివరామప్రసాద్ అవనిగడ్డ న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ఈ ఏడాది జనవరి 20వ తేదీన నిందితులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించటంతో ఎస్‌ఐ డి చంద్రశేఖర్ అదే రోజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ఐదుగురిని అరెస్టు చేశారు. కీలక నిందితురాలుగా ఉన్న అరుణ కనపడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు మంగళవారం అరుణను అరెస్టు చేసి అవనిగడ్డ కోర్టుకు తరలించగా నిందితురాలు అరుణకు 15 రోజులు రిమాండ్ విధించారు. ఈ కేసు ఇలా ఉండగా మరో 30 గ్రూపులను ఏర్పాటుచేసి దాదాపు రూ.90లక్షలు వరకు లింకేజి రుణాలు స్వాహా చేసినట్లు పలువురు డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు.