క్రైమ్/లీగల్

రంగాపూర్‌లో టాస్క్ఫోర్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, జూన్ 5: మండలంలోని రంగాపూర్ గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసు బృందం మంగళవారం సాయంత్రం ఆకస్మిక దాడులు చేపట్టింది. రామగుండం టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారధి ఆదేశాల మేరకు సీఐ సారిలాల్ ఆధ్వర్యంలో బసంత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రంగాపూర్ గ్రామానికి చెందిన ఎంచర్ల లింగయ్య ఇంట్లో సోదాలు చేయగా, 2 లక్షల రూపాయల పైచీలుకు విలువజేసే నిషేధిత అంబార్, గుట్కా ప్యాకెట్లు లభించాయి. అయితే నిషేధిత అంబార్, గుట్కా ప్యాకెట్లు కమాన్‌పూర్ మండలం గొల్లపల్లికి చెందిన మల్యాల సుదర్శన్‌కు చెందినవిగా ఎంచర్ల లింగయ్య చెప్పాడని టాస్క్ఫోర్స్ సీఐ సారిలాల్ తెలిపారు. అంబార్, గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఎంచర్ల లింగయ్యను తదుపరి విచారణ నిమిత్తం బసంత్‌నగర్ పోలీసులకు అప్పగించినట్టు వివరించారు. ఈ దాడులలో టాస్క్ఫోర్స్ ఎస్సై రమేష్ గౌడ్, సిబ్బంది సదానందం గౌడ్, నిజాం శేఖర్, రవికుమార్, మహేందర్, చంద్రశేఖర్, ససదానందం పాల్గొన్నారు.