క్రైమ్/లీగల్

వేర్వేరు ప్రమాదాల్లో ఒకని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, జూన్ 7 : గుత్తి మండల పరిధిలోని కొత్తపేట, జక్కల చెరువు గ్రామాల సమీపంలో గురువారం జరిగిన ప్రమాదాల్లో వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దవడుగూరు మండలం కండ్లగూడూరు గ్రామానికి చెందిన రాము గుత్తి మండలం తొండపాడు గ్రామంలో వివాహం చేసుకున్నాడు. ఈనేపథ్యంలో గురువారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంలో గుత్తి నుంచి అత్తగారి ఊరైన తొండపాడుకు వస్తుండగా కొత్తపేట మలుపువద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కన గుంతలో పడి అక్కడిక్కడే మృతి చెందాడు. అలాగే జక్కలచెరువు గ్రామ సమీపంలో టిప్పరు, లారీ ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ రామాంజినేయులు తీవ్రంగా గాయపడ్డాడు. తాడిపత్రి నుంచి గుత్తికి లారీలో వస్తున్న రామాంజినేయులు వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో రామాంజినేయులు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన అతన్ని హుటాహుటిన గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అదనపు వైద్య సేవల కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గుత్తి పోలీసులు తెలిపారు.