క్రైమ్/లీగల్

15 ఎర్రచందనం దుంగలు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దవటం, జూన్ 7: సిద్దవటం రేంజ్ పరిధిలోని రోళ్లగోడు బీటులో బుధవారం సాయంత్రం ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు తమిళకూలీలను అరెస్టుచేసి, వారి వద్దనుంచి 15ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు ట్రైనీ ఐఎఫ్‌ఎస్ నరేంద్ర తెలిపారు. స్థానిక అటవీశాఖ కార్యాలయంలో ఎర్రచందనానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ కడప డిఎప్‌వో శివప్రసాద్‌కు అందిన సమాచారం మేరకు రోళ్లగూడు బీటులో గాలింపుచర్యలు చేపట్టామన్నారు. నరుకుడుబండ ప్రదేశంలో అక్రమంగా తరలించేందుకు సిద్దంగా ఉంచిన 15 దుంగలను స్వాధీనంచేసుకున్నామన్నారు. 11 మంది తమిళకూలీలు ఉండగా గాలిలో కాల్పులు నిర్వహించి ముగ్గురిని అరెస్టుచేయగా, 8మంది పరారయ్యారన్నారు. అరెస్టయిన వారిలో తమిళనాడు రాష్ట్రం కళ్లగుత్తి జిల్లాకు చెందిన జయశంకర్, గోపాలస్వామి, కొండాన్ సిన్‌లను అరెస్టు చేశామన్నారు. పట్టుబడిన దుంగల విలువ రూ.లక్షా 23వేలు విలువ చేస్తాయన్నారు. ఎర్రచందనానికి సంబంధించిన సమాచారం ఇస్తే వారిపేర్లు గోప్యంగా ఉంచి, పారితోషికం ఇస్తామన్నారు. అరెస్టయినవారిని కోర్టుకు హాజరుపరిచామన్నారు.