క్రైమ్/లీగల్

ప్రాణహిత నది తీర గ్రామంలో టాస్క్ఫోర్సు దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌటాల, జూన్ 7: ఇటీవల వరుస మెరుపు దాడులతో అక్రమార్కుల భరతం పడుతున్న టాస్క్ఫోర్సు బృందం తాజాగా గురువారం చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామంలో ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఉదయం 4 గంటలకు టాస్క్ ఫోర్సు సి ఐ అల్లం రాంబాబు నేతృత్వంలోని చింతలమానేపల్లి ఎస్సై రాజ్‌కుమార్ తో కలిసి గూడెం గ్రామానికి చేరుకొని అక్కడ పక్కా సమాచారం మేరకు అనుమానిత ఇండ్లలో సోదాలు నిర్వహించింది. ఈ దాడులలో గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ కస్తురి అశోక్ రెడ్డి తో పాటు మనోజ్ జైస్వాల్, సంతోష్ జైస్వాల్, కస్తూరి రాఘవ రెడ్డి, బోయిన రవి, తో పాటు అత్రం కిష్టయ్య, అత్రం తిరుపతి, నికోడే రాజు, ఎండి మోంజా ల ఇల్లులు, దుకాణాలలో సోదాలు నిర్వహించగా 93 వేల 360 రూపాయల విలువైన అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం, 8 కిలోల నకిలీ గ్లైసిల్ పత్తి విత్తనాలు స్వాధీన పరుచుకున్నారు. సి ఐ రాంబాబు పేర్కొన్నారు. నికోడే రాజు వద్ద 8 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, ఎండి మోంజా కిరాణ దుకాణంలో 2 వేల రూపాయల గుట్కాలు లభించగా , అశోక్ రెడ్డి, మనోజ్ జైస్వాల్, సంతోష్ జైస్వాల్ , రవిల వద్ద మిగితా అక్రమ మద్యం లభించిందని పేర్కొన్నారు. వీరందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిమిత్తం చింతలమానేపల్లి ఎస్సై రాజ్‌కుమార్‌కు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ నకిలీ అక్రమ దందాలు చేసిన టాస్క్ఫోర్సుకు సమాచారం అందించాలని తమకు వివరాలు తెలిపిన వారి విషయాలను గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.
ఇలా ఉండగా, నేర నిరోధానికి ముందస్తుగా బైండోవర్ చేసినప్పటికీ తహసీల్దార్ ఎదుట ఇచ్చిన బైండోవర్ అతి క్రమణతో బాధ్యులైన ఐదుగురు అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న వ్యక్తుల బైండోవర్ పూచీకత్తు జప్తు కానున్నట్లు టాస్క్ఫోర్సు సి ఐరాంబాబు వెల్లడించారు. ఈ మేరకు ఆకస్మిక దాడి అనంతరం చింతలమానేపల్లి ఎస్సై రాజ్‌కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. గతంలో మూడు నెలల క్రితం నిర్వహించిన టాస్క్ఫోర్సు దాడిలో కస్తూరి అశోక్ రెడ్డి, మనోజ్ జైస్వాల్, కస్తూరి రాఘవ రెడ్డి, సంతోష్ జైస్వాల్, రవిల నుంచి మద్యం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగిందని వారిపై మరోసారి ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల పూచీకత్తుతో స్థానిక తహసీల్దార్ ఎదుట బైండోవర్ నిర్వహించారని అయినప్పటికీ వారి తీరు మారకుండా మరోసారి అక్రమ దందాకు పాల్పడుతూ దొరికిన నేపథ్యంతో వారికి లక్ష రూపాయల చొప్పున ఉన్న పూచీకత్తును జప్తు అవుతాయని వివరించారు.