క్రైమ్/లీగల్

పిడుగుపాటుకు గిరిజనుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం, జూన్ 7: కడెం మండలంలోని కన్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల వెంకట్‌నగర్ గ్రామానికి చెందిన కొమురం రాము(50) అనే గిరిజనుడు చేపలవేటకై కడెం జలాశయంలోకి వెళ్లి పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మండలంలోని కన్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల వెంకట్‌నగర్ గ్రామానికి చెందిన కొమురం రాము బుధవారం సాయంత్రం కడెం ప్రాజెక్టు జలాశయంలో చేపలవేట కోసం వెళ్లాడు. జలాశయంలో తెప్పపై చేపలవేట కొనసాగిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఈదురుగాలులు భారీ వర్షం రావడంతో అతనిపై పిడుగుపడడంతో నీటిలో పడి మృతిచెందాడు. కాగా బుధవారం సాయంత్రం ఈదురుగాలులు, అకాలవర్షం రావడంతో ఆ సమయంలో కొమురం రామును వెతకడానికి ఎవరూకూడా జలాశయంలోకి వెళ్లలేకపోయారు. గురువారం ఉదయం 7 గంటలకు జలాశయంలో వెతకగా తిరుపతి, జంగులు గాలించి అతని మృతదేహాన్ని వెతికి తీశారు. సంఘటన స్థలాన్ని కడెం ఎస్సై సయ్యద్ ముజాహిద్ సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతునికి భార్య బాగుబాయి, కుమారులు విజయ్, జగదీష్, కుమార్తె శిరీషలు ఉన్నారు.