క్రైమ్/లీగల్

టాస్క్ఫోర్స్ అదుపులో నిరుద్యోగులను మోసగిస్తున్న వ్యక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర కరీంనగర్, జూన్ 7: నిరుద్యోగులను మాయ మాటలతో మోసగిస్తున్న పెద్దపల్లి జిల్లాకు చెందిన బండి హన్మంత రావును గురువారం టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి ఒక సెల్ ఫోన్, రెండు లక్షల 40 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..హన్మంత రావు డిగ్రీ చదివే రోజుల్లోనే తన స్నేహితులను మోసగిస్తూ గడిపేవాడు. కొన్ని రోజులు బయటి దేశాలకు వెళ్లి వచ్చి నకిలీ తహశీల్దార్, లెక్చరర్ అని నమ్మించి మోసం చేసేవాడు. ఇలా చేయుచున్న అతని మీద టాస్క్ఫోర్స్‌కు అందిన పక్కా సమాచారం మేరకు వలపన్ని ప్రభుత్వ ఉద్యోగిగా చెప్పుకుంటు తిరుగుతున్న హన్మంత రావును టూ టౌన్ పోలీసులు, టాస్క్ఫోర్స్ సిబ్బంది పట్టుకొని అరెస్ట్ చేశారు. నిరుద్యోగులను ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకొని వారికి నమ్మకం కల్పించి ఉద్యోగం ఇప్పిస్తానని మాయ మాటలు చెబుతూ వారిని కరీంనగర్‌లోని ప్రముఖ హోటల్‌కు పిలిపించుకొని వచ్చిన వారితో నమ్మకం కలిగే విధంగా ప్రవర్తిస్తూ వారి వద్ద నుండి నగదు, ఆధార్, విద్యా సర్ట్ఫికేట్స్ జిరాక్స్ తీసుకొని డబ్బులు ముట్టగానే వారికి దొరకకుండా తిరుగుతుంటాడు. ఒకవేళ బాధితులు ఫోన్‌లో సంప్రదిస్తే అపాయింట్‌మెంట్ లెటర్ వస్తుందని మాయ మాటలు చెబుతూ కాలం గడుపుతుంటాడు. ఈ విధంగా చాలా మంది బాధితుల వద్ద నుండి ఇప్పటివరకు పది లక్షలకు పైగా డబ్బులు తీసుకొని తన వ్యసనాలకు వినియోగించుకొని వారిని మోసం చేసినట్లు టాస్క్ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో టాస్క్ఫోర్స్ సిఐలు ఎస్.శ్రీనివాస రావు, బి.మాధవి, ఎస్‌ఐ ఎం.రమేష్, సిబ్బంది టి.వివేక్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.