క్రైమ్/లీగల్

ఎస్‌బీఐలో ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, జూన్ 7: సుల్తానాబాద్ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లో గురువారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ పైకప్పు నుండి పెద్దపెద్ద పెచ్చులు, ఫ్యాన్ ఒక్కసారిగా కిందపడిపోవడంతో పలు పనుల నిమిత్తం బ్యాంక్‌కు వచ్చిన ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బ్యాంకులో ఒక్కసారిగా పైకప్పు నుండి పెచ్చులు, ఫ్యాన్ కిందపడడంతో అక్కడే ఉన్న పలువురు ఏం జరిగిందోనన్న భయంతో ఉలిక్కిపడ్డారు. ఉరుకుల పరుగులతో బయటకు వచ్చి ఊపిరి పీల్చుకున్నారు. తీవ్రగాయాలకు గురైన వారిని వెంటనే సుల్తానాబాద్‌లో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు ఆసుపత్రికి తరలించారు. గాయాలకు గురైన వారిలో సుల్తానాబాద్‌కు చెందిన పల్లా శ్రీనివాస్, వంగల శ్రీనివాస్, మానకొండూర్ మండలం వెల్ది గ్రామానికి చెందిన మారవేని రాజయ్య, జానత ఓదెలు, కొదురుపాక-దేవునిపల్లి గ్రామానికి చెందిన ఎస్.లక్ష్మణ్, గట్టెపల్లి గ్రామానికి చెందిన భీమరాజుల శ్రీనివాస్, పూసాల గ్రామానికి చెందిన లక్ష్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులతో బ్యాంక్ మేనేజర్ ఎం.శ్రీనివాస్ కరీంనగర్‌కు వెళ్లారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరినట్లు మేనేజర్ తెలిపారు. ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరగటం, ఏడుగురికి గాయాలు కావటం బాధాకరమని శ్రీనివాస్ పేర్కొన్నారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
సుల్తానాబాద్ ఎస్‌బీఐ బ్యాంకులో పైకప్పు పెచ్చులు కిందపడి ఏడుగురు గాయాలకు గురికాగా, సంఘటనా స్థలాన్ని గురువారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, డీసీపీ సుదర్శన్‌లు పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన సమాచారం అందుకున్న ఐపీఎస్ అధికారి శరత్‌చందర్ పవార్, సీఐ రాములు, ఎస్‌ఐ కె.రాజేష్‌లు హుటాహుటిన బ్యాంక్ వద్దకు వచ్చి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకుగాను సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్, రైస్‌మిల్లు వ్యాపారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కె.రాజేష్ తెలిపారు.